https://oktelugu.com/

NRI News : నెల రోజులకు భారతీయుడి మృతదేహం గుర్తింపు.. యూఎస్‌ నేషనల్‌ పార్క్‌లో ఏం జరిగిందంటే?

అగ్రరాజ్యం అమెరికా.. మోంటానాలోని గ్లేసియర్‌ నేషనల్‌ పార్క్‌లో పార్క్‌ రేంజర్స్‌ దాదాపు నెల రోజుల క్రితమ మునిగిపోయిన సిద్ధాంత్‌ పాటిల్‌ మృతదేహం ఎట్టకేలకు గుర్తించారు. ఇతను జులై 6న అవలాంచె క్రీక్‌లో పడి చనిపోయి ఉంటాడని భావించారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 11:57 am
    NRi

    NRi

    Follow us on

    NRI News : అగ్రరాజ్యం అమెరికా.. మోంటానాలోని గ్లేసియర్‌ నేషనల్‌ పార్క్‌లో పార్క్‌ రేంజర్స్‌ దాదాపు నెల రోజుల క్రితమ మునిగిపోయిన సిద్ధాంత్‌ పాటిల్‌ మృతదేహం ఎట్టకేలకు గుర్తించారు. ఇతను జులై 6న అవలాంచె క్రీక్‌లో పడి చనిపోయి ఉంటాడని భావించారు. మహారాష్ట్రలో జన్మించిన సిద్ధాంత్‌ పాటిల్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్నాడు. జూలై 6వ తేదీన అవలాంచె లేక్‌ ట్రైల్‌లో ఒక కొండ పైకి వెళ్లాడు. అక్కడ అతను ఒక పెద్ద రాతిపై నిలబడి అవలాంచె క్రీక్‌లో పడిపోయాడు. పాటిల్‌ స్నేహితులు అతను నీటి అడుగున వెళ్లి తిరిగిపైకి రావడంతో కరెంటులో కొట్టుకుపోవడాన్ని చూశారు. సిద్ధాంత్‌ మృతదేహం లభ్యమైనట్లు యుఎస్‌ రేంజర్‌ అధికారులు తమకు సమాచారం అందించారని సిద్ధాంత్‌ మామ ప్రితేష్‌ చౌదరి తెలిపారు. జూలై 6న సిద్దాంత్‌ అవలాంచెక్రీక్‌లో డిపోయినట్లు గ్లేసియర్‌ నేషనల్‌ పార్క్‌ అధికారులు తెలిపారు. వారా అన్వేషణ తర్వాత గ్లేసియర్‌ నేషనల్‌ పార్క్‌లోని రేంజర్లు సిద్ధాంత్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నీటిలో మునిగిపోయిన సిద్ధాంత్‌.. అడుగు బాకంలో చిక్కుకుపోయినట్లు తెలిపారు. ఘటన సమయంలో సిద్ధాంత్‌ ధరించిన దాస్తులు, సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. శనివారం(ఆగస్టు 4న) ఉదయం 10:30 గంటలకు ఒక పార్క్‌ సందర్శకుడు జార్జ్‌ క్రింద అవలాంచె క్రీక్‌లో మృతదేహాన్ని చూసినట్లు నివేదించారు. రేంజర్లు వెంటనే రికవరీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఫ్లాట్‌హెడ్‌ కౌంటీ కరోనర్‌ డీఎన్‌ఏ లేదా డెంటల్‌ రికార్డుల ద్వారా గుర్తింపును నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు, సిద్ధాంత్‌ మృతదేహాన్ని గుర్తించేందుకు అమెరికా అధికారులను కోరేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ జోక్యం చేసుకోవాలని గతంలో అభ్యర్థించింది. ఈమేరకు నెల రోజుల శోధన తర్వాత మృతదేహం లభించింది.

    ఏం జరిగిందందే..
    అమెరికాలో మునిగిపోయిన భారతీయ టెక్కీ సిద్ధాంత్‌ పాటిల్‌ విషాదానికి గంటల ముందు తల్లికి సందేశం పంపినట్లు బంధువు చెప్పారు. ప్రీతి, గృహిణి, సిద్ధాంత్‌ తండ్రి విఠల్‌ నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. జూలై 6వ తేదీన తల్లి ప్రీతికి ఫోన్‌ చేసి, తాను మరో ఆరుగురు భారతీయ స్నేహితులతో కలిసి మూడు రోజులు పార్కులో ఉన్నానని, ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పాడు. తాను మరో మూడు రోజుల్లో కాడెన్స్‌ డిజైన్‌ సిస్టమ్స్‌లో పనిచేసిన శాన్‌ జోస్‌కు తిరిగి వస్తానని ఆమెకు చెప్పాడు. అతని స్నేహితులు అతని గదిలోని ఫోన్‌ బాక్స్‌ నుండి అతని ఐఫోన్‌ ఐఎంఈఐ నంబర్లు సేకరించారు. మృదేహం గుర్తింపు కోసం మోంటానాలోని పార్క్‌ రేంజర్స్, ఇతర అధికారులకు అందించారు.

    2020లో అమెరికా వెళ్లిన సిద్ధాంత్‌..
    ఇదిలా ఉంటే సిద్ధాంత్‌ 2020లో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ ఎంఎస్‌ చేయడానికి వెళ్లాడు. చదువు పూర్తయ్యాక 2023లో కాడెన్స్‌లో ఉద్యోగంలో చేరాడు.

    అమెరికాలో వరుసగా భారతీయులు అయితే కాల్పుల్లో లేదంటే ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో భారతీయుల మరణాలు అమెరికాలో ఎక్కువై పోతున్నాయి. కొన్ని జాత్యంహకార దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో ఒకరకమైన ఆందోళన భయం నెలకొంది..