Woman Bites Off Husband Tongue: భర్తలపై భార్యల దాష్టీకాలు ఆగడం లేదు. పైగా అవి రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ భార్యలు మారడం లేదు. పైగా భర్తలపై అంతకుమించి అనే రేంజ్ లో రీవెంజ్ తీర్చుకుంటున్నారు. ఒకప్పుడు భార్యలు బాధిత స్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆస్థానాన్ని భర్తలు ఆక్రమించారు.. వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాలతో భార్యలు భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే భూమి మీద లేకుండా చేస్తున్నారు. ప్రియుళ్ల సహకారంతో ప్రాణాలు తీస్తున్నారు. అయితే ఇటువంటి వివాహేతర సంబంధం లేకపోయినప్పటికీ ఓ భార్య భర్తను రప్పా రప్పా చేద్దామనుకుంది. అదృష్టవశాత్తూ అతడు బతికి బట్టకట్టాడు.
బీహార్ రాష్ట్రంలోని ఖిజ్రాసరాయ్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఈ భార్యాభర్తలు నివసిస్తున్నారు. భార్య కాస్త సూర్యకాంతం టైపు. ప్రతి విషయాన్ని సాగదీస్తుంది. ప్రతి విషయంలోనూ వాదన పెట్టుకుంటుంది. తన వైపు తప్పున్నా నెగ్గాలి అనుకుంటుంది. అందువల్లే భర్తను నిత్యం వేధిస్తూనే ఉంటుంది. పిల్లలు ఉన్నారని కారణంతో అతడు ఏమీ అనలేడు. పైగా చుట్టుపక్కల వాళ్ళు వింటారనే నెపంతో నిశ్శబ్దంగా ఉంటాడు. అయితే భర్త నిశ్శబ్దంగా ఉంటున్నా ఆమె మాత్రం మారడం లేదు. పైగా అంతకుమించిన రేంజ్ లో అతడి మీద దండయాత్ర చేస్తోంది. ఇన్ని సంవత్సరాలపాటు భార్య చేతిలో తిట్లు తిన్న అతడు.. తొలిసారిగా ప్రతిస్పందించడం మొదలు పెట్టాడు. కానీ అదే అతని పాలిట శాపం అయింది.
Also Read: మూడేళ్ల కూతురి మాటలు.. తల్లి వివాహేతర సంబంధాన్ని రట్టు చేశాయి..
ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. ఇన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉన్న అతడు ఎదురు తిరిగాడు. “ఇదేంటి ఇలా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తున్నావు. సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నా. అయినా నువ్వు మారడం లేదు. పిల్లల కోసం నిశ్శబ్దంగా ఉంటున్నాను. అయినప్పటికీ రెచ్చిపోతున్నావ్. నువ్వు నోరు తగ్గించకపోతే బాగోదని” భర్త అన్నాడు. ఇన్ని రోజులపాటు కుక్కిన పేను లాగా ఉన్న అతడు ఒక్కసారిగా స్పందించడంతో ఆ భార్య అపర కాళిలాగా మారిపోయింది. మరో మాటకు తావు లేకుండా అతనిపై విరుచుకుపడింది. నన్నే అంటావా అంటూ.. అతని నాలుకను అమాంతం కొరికేసింది. కొరకడం మాత్రమే కాదు.. అతను చూస్తుండగానే నమిలి మింగేసింది. దీంతో అతడు కింద పడిపోయి గిలా గిలా కొట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు చూసి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా భర్తపై ఆమె వాదులాటకు దిగడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముందు భర్త నిశ్శబ్దంగానే ఉన్నాడని.. ఒక్క మాట అన్నందుకు భార్య ఆ స్థాయిలో రెచ్చిపోయిందని.. తాము లేకుంటే అతని ప్రాణాలు కూడా తీసేదని స్థానికులు అంటున్నారు.