Bengaluru: వివాహం అనేది అన్ని విషయాలలో కెల్లా ఘనమైనది అంటారు. మన సమాజంలో చాలామంది తొలి వివాహానికి విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. కానీ, ఇటీవల కాలంలో బహుళ వివాహాలు (multi marriages) చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇందులో మగాళ్లు, ఆడవాళ్లు పోటీ పడుతున్నారు.
పెద్దలు కుదిర్చినవి మాత్రమే కాదు, ప్రేమించి చేసుకున్న వివాహాలు కూడా నిలబడటం లేదు. పైగా, సర్దుకుపోయే విషయంలో నేటితరం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఎంతకీ తాము కోరుకున్నద జరగాలని.. తాము అనుకున్నది నెరవేరాలని బలంగా అనుకొంటున్నారు. ఇందుకోసం ఎంత దాకా అయినా సరే వెళ్తున్నారు. అవసరమైతే తెగ దెంపుల కూ వెనుకాడటం లేదు. ఇంకా కొందరైతే వెంటనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అదికూడా పెడాకులు అయిపోతే.. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
బెంగళూరు నగరంలో పై తరహా సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకరిని కాదు, ఇద్దరిని కాదు.. ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన దేశ ఐటీ రాజధానిలో కలకలం సృష్టించింది.. బెంగళూరు నగరంలోని కనకపుర ప్రాంతానికి చెందిన ఓ మహిళ గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడికి కారు, బైకు నడపడం రాకపోవడంతో ఆ కారణాలను చూపుతూ విడాకులు ఇచ్చింది.
మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత డెలివరీ బాయ్ ని ప్రేమించింది . అతడిని వివాహం చేస్తుంది. డెలివరీ బాయ్ తో ఏడాదిన్నర పాటు కాపురం చేసింది. ఆ తర్వాత 20 లక్షలను అతడి ఇంటి దగ్గర నుంచి దొంగతనం చేసింది. ఆ తర్వాత కనకపుర ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి దగ్గరయింది. డెలివరీ బాయ్ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన 20 లక్షలతో కాపురం మొదలుపెట్టింది. దీంతో ఆ డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటన బెంగళూరు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.