Medchal Atrocity: పోలీసులు అరెస్టు చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ.. కొంతమంది భార్యలు మారడం లేదు. భర్తల విషయంలో వారు తమ వైఖరి మార్చుకోవడం లేదు. పైగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు ఊహించని స్థాయిలో దారుణాలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాలు.. ఇతర వ్యవహారాలే ఈ ఘటనలకు కారణమవుతున్నాయని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. భర్త హత్యకు భార్య ఏకంగా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం నలుగురు యువకుల సహాయం తీసుకుంది. ఆ నలుగురు యువకులు అతడిని తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేశారు. ప్రాణాలతో బయటపడిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్
హైదరాబాదులోని కుత్బుల్లా ప్రాంతంలో రాందాస్, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే జ్యోతి వ్యవహార శైలిపై ఇటీవల రాందాస్ కు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెను ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానం చెప్పింది. అప్పటినుంచి రాందాస్ ఆమెతో గొడవ పడుతూనే ఉన్నాడు. జ్యోతి కూడా ఏమాత్రం తగ్గకుండా అతనిని తిడుతోంది. పైగా జ్యోతి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందని రాందాస్ కు ఇటీవల రూడీ అయినట్టు తెలుస్తోంది. అందువల్లే అతడు ఆమె వ్యవహార శైలి పట్ల ఆగ్రహం గా ఉన్నట్టు తెలుస్తోంది.
నిత్యం రాందాస్ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో జ్యోతి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఒక నలుగురు యువకులతో మాట్లాడి.. అతడిని అంతం చేయాలని భావించింది. ఈ ప్రణాళికలో భాగంగా రాందాస్ కు పీకలదాకా మద్యం తాగించిన ఆ నలుగురు యువకులు.. అతడిని తీవ్రంగా కొట్టారు. చనిపోయాడు అని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.. కొంతసేపటికి స్పృహ వచ్చిన తర్వాత రాందాస్ లేచాడు. ఆ తర్వాత రక్తం, గాయాలతో నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లాడు. పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి.. దాడి చేసిన నలుగురు యువకులు, జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
రాందాస్ ను తీవ్రంగా కొట్టిన తర్వాత.. అతడు శ్వాస సరిగా తీసుకోలేకపోవడంతో చనిపోయాడని భావించారు. కానీ రాందాస్ చాలాసేపటికి లేచి.. అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని పోలీసులను ఆశ్రయించాడు.. ఇటీవల కాలంలో భార్యల చేతులో బట్టలు హతమవుతున్నారు. మనదేశంలో రోజుకో తీరుగా ఈ తరహ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే భార్య చేతిలో దాడికి గురైనప్పటికీ.. రాందాస్ బతికి బట్ట కట్టడం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు పేర్కొంటున్నారు.