France : మాదకద్రవ్యాలు ఇచ్చి.. 70 మందితో కలిసి.. భార్యపై చేయకూడని దారుణం.. వీడు అసలు భర్తే కాదు

భర్త అంటే భరించేవాడని పెద్దలంటారు.. కానీ ఇతడు మాత్రం బాధించేవాడు అని చాటి చెప్పాడు. ఈ భూమ్మీద ఏ భర్త కూడా చేయని దారుణానికి ఒడిగట్టాడు. బతికి ఉండగానే నరకం చూపించాడు. ప్రస్తుతం అతడి పాపం పండింది. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 10:39 pm

France

Follow us on

France : కట్టుకున్న భార్యపై కసాయిగా ప్రవర్తించాడు ఈ భర్త. ఆమెపై ప్రతిక్షణం తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. చివరికి అతడిలో ఉన్మాదం తారాస్థాయికి చేరింది. ఫలితంగా తన భార్యకు మాదకద్రవ్యాలు ఇచ్చి నరకం చూపించాడు. అంతేకాదు పలువురితో చేయకూడని పనులు చేయించాడు. ఆ దృశ్యాలను అత్యంత రహస్యంగా రికార్డు చేశాడు. ఈ దారుణమైన ఘటన ఫ్రాన్స్ దేశంలో వెలుగు చూసింది. ఈ ఘటనపై గతంలోని కేసు నమోదయింది. మళ్లీ ఇప్పుడు విచారణ జరిగింది. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఈ ఘటనలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని.. అతడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తోంది.

ఫ్రాన్స్ దేశంలో..

ఫ్రాన్స్ దేశంలో ఓ ప్రభుత్వరంగ సంస్థలో 71 సంవత్సరాల వ్యక్తి ఉద్యోగి గా పనిచేశాడు. ఇతడికి భార్య ఉంది. ఆమెపై అప్పట్లో అతడు దారుణంగా ప్రవర్తించాడు. రాత్రి సమయంలో ఆమె తినే ఆహారంలో రహస్యంగా మాదకద్రవ్యాలు కలిపేవాడు. ఆమె ఆహారం తిని మత్తులోకి చేరుకునేది. ఆ తర్వాత అతడు కొందరు వ్యక్తులను తీసుకొచ్చి.. ఆమెపై లైంగిక దాడి చేసేలాగా పురి గొలిపేవాడు. ఈ దారుణ దృశ్యాలను రహస్యంగా ఏర్పాటుచేసిన కెమెరాలలో చిత్రీకరించేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పది సంవత్సరాలు పాటు ఆమెపై ఈ దుర్మార్గాన్ని ప్రదర్శించాడు.. పోలీసుల విచారణ ప్రకారం 2011 నుంచి 2020 వరకు ఆకృత్యాలు జరిగాయని తెలుస్తోంది.

ఇలా వెలుగు చూసింది

2020లో ఆ నిందితుడు ఓ షాపింగ్ సెంటర్ లో కొందరు మహిళలను అత్యంత రహస్యంగా వీడియో తీశాడు. ఆ వ్యవహారాన్ని ఒక సెక్యూరిటీ గార్డ్ నిందితుడిని గుర్తించి పట్టుకొన్నాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు అతడిని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న ఫోన్, కంప్యూటర్ ను పరిశీలించారు. అందులో అతగాడు రికార్డు చేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యాలలో అతని భార్య ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 72 మంది 92 సార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది. ఈ దారుణానికి పాల్పడిన వారి వయసు 26 నుంచి 73 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. వీరిలో 51 మందిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బహిరంగంగా విచారించాలి

ఈ కేసును బహిరంగంగా విచారించాలని ఆ బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. “నాపై పది సంవత్సరాలుగా ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ నాకు తెలియకుండానే చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ఇటువంటి దారుణం ఏ మహిళకు తన భర్త నుంచి జరిగి ఉండదు కావచ్చు. వచ్చే కాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే కచ్చితంగా బహిరంగ విచారణ నిర్వహించాలని” ఆమె డిమాండ్ చేశారు. అయితే ఈ విచారణకు ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి హాజరు కావడం విశేషం.