Achampet Crime News: అనైతికమైన వ్యవహారాలు ఎప్పటికైనా ప్రమాదమే. వాటి వల్ల తాత్కాలిక ఆనందం ఉండవచ్చు గాని.. ఆ తదుపరి పర్యవసనాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి.. పైగా ఇవి ఘోరాలకు, దారుణాలకు దారి తీస్తాయి. ఈ తరహా సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పైగా ఈ ఘటనలలో నిందితులు త్వరగానే పోలీసులకు దొరికిపోతున్నారు. చట్టం ముందు దోషులుగా నిలబడుతున్నారు. అయినప్పటికీ మిగతావారిలో మార్పు రావడం లేదు.
మన సమాజంలో ఉపాధ్యాయులకు సముచితమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే గౌరవం లభిస్తుంది. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇద్దరు.. అనైతికమైన బంధానికి శ్రీకారం చుట్టారు. తమ తమ జీవిత భాగస్వాములను మోసం చేశారు. చివరికి తమ సంబంధం కోసం దారుణానికి కూడా ఒడిగట్టారు. చివరికి దొరికిపోయి ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట పట్టణం మారుతి నగర్ లో చోటుచేసుకుంది.
మారుతి నగర్ లో లక్ష్మణ్ నాయక్, అతడి భార్య పద్మ నివాసం ఉంటున్నారు. పద్మకు 2024 లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది ప్రస్తుతం ఆమె ఉప్పునూతల మండలం బట్టుగాడిపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది. పద్మకు తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే గోపి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పద్మ, గోపి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం లక్ష్మణ్ నాయక్ తెలిసింది. దీంతో అతను భార్యను మందలించాడు. ఈ నేపథ్యంలో తమ సంబంధానికి అతని అడ్డు లేకుండా తొలగించుకోవాలని పద్మ, గోపి భావించారు. ఇందులో భాగంగానే గత నెల 24న లక్ష్మణ్ నాయక్ తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ ముక్కు, నోటిమీద గుడ్డతో మూసి ఊపిరి ఆడకుండా చేశారు పద్మ, గోపి. ఆ తదుపరి రోజు పద్మ ఏమీ తెలియనట్టుగానే పాఠశాలకు వెళ్లింది. అంతే కాదు, తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానికి ఫోన్ చేసింది. తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఆయన ఫోన్ ఎత్తకపోవడం పట్ల భయంగా ఉందని నటన మొదలుపెట్టింది. ఇంటి యజమాని ఎంత ప్రయత్నించినా లక్ష్మణ్ తలుపు తీయలేదు. ఈ లోగానే పద్మ స్కూల్ నుంచి వచ్చింది. ఇంటి తలుపు తీయడంతో లక్ష్మణ్ చనిపోయి కనిపించాడు. భర్తకు గుండెపోటు వచ్చి చనిపోయినట్టు అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది పద్మ.
లక్ష్మణ్ సోదరుడు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పద్మ ఫోన్ కాల్ డేటా ను పరిశీలించారు.. ఆమె తరచూ గోపికి ఫోన్ చేసినట్టు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇతని అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్ కు తరలించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు ఇలా గాడి తప్పారు. చివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
ఇద్దరు ఉపాధ్యాయుల అక్రమ సంబంధానికి భర్త బలి
పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ప్రాణాలు తీస్తున్నారు
ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు హంతకులుగా మారారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో గత నెల 25న లక్ష్మణ్ నాయక్(38) అనుమానాస్పద మృతి
ఉప్పునుంతల మండలం… https://t.co/WQh04eNVwY pic.twitter.com/lF6run7wL0
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2025