https://oktelugu.com/

Salman Khan : సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన వ్యక్తి ఆత్మహత్య.. కలకలం

గతంలో సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి ఆయనకు వై + భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ ఇంటివద్ద ఘటన జరిగిన నేపథ్యంలో, సెలబ్రిటీల ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 08:02 PM IST

    The man who opened fire at Salman's house committed suicide

    Follow us on

    Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులు జరిపిన ఘటనలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. అలా పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు అనూజ్ థాపన్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. అనూజ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. బుధవారం లాకప్ లో ఉన్న అతడు.. మూత్రశాలలో బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూత్రశాలకు వెళ్లిన అనూజ్ ఎంతసేపటికీ రాకపోవడంతో, అనుమానం వచ్చిన పోలీసులు మూత్రశాల గది తలుపును తెరిచేందుకు ప్రయత్నించారు. అది ఓపెన్ కాకపోవడంతో గట్టిగా కొట్టారు. దీంతో అనూజ్ ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ముంబైలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడని పోలీసులు పేర్కొన్నారు.

    ఎందుకు అరెస్ట్ చేశారు?

    గత నెల 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. సల్మాన్ ఖాన్ కుటుంబం నివాస ఉంటున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తుపాకులతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన ముంబైలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లారు. ఘటన గురించి వాకబు చేశారు. అనంతరం నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయడంతో.. వారు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.

    సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి..

    ముందుగా పోలీసుల బృందం సిసి టీవీలను పరిశీలించింది. కాల్పులు జరిపిన నిందితులు విక్కీగుప్తా, సాగర్ పాల్ గా గుర్తించి అరెస్టు చేసింది. వీరికి ఆయుధాలు సరఫరా చేసిన అనూజ్ థాపన్, సోనూ సుభాష్ చందర్ ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఇందులో సోనూ మినహా మిగతా ముగ్గురికి న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించింది. అనారోగ్యం వల్ల సోనూ ను కష్టానికి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరలేదు.

    ఆ సభ్యుల పనేనా?

    పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులని పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్ ఖాన్ ఇంటివద్ద తామే కాల్పులకు పాల్పడ్డామని లారెన్స్ తమ్ముడు అన్మోల్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. కాగా, గతంలో సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి ఆయనకు వై + భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ ఇంటివద్ద ఘటన జరిగిన నేపథ్యంలో, సెలబ్రిటీల ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.