Agra
Agra: కోవిడ్ తర్వాత మనుషుల ఆరోగ్యాలు సమూలంగా మారిపోయాయి. శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు 60 దాటితే వచ్చే గుండెపోటు.. ఇప్పుడు రెండేళ్ల చిన్నారులను సైతం వదిలిపెట్టడం లేదు.. కోవిడ్ సమయంలో వేసుకున్న వ్యాక్సిన్ ల వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలు ఇందుకు కారణమని కొంతమంది వైద్యులు చెబుతుండగా… శారీరక వ్యాయామం లేకపోవడం.. జంక్, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అకస్మాత్తుగా సంభవించే గుండెపోట్లకు కారణమని మరి కొంతమంది వైద్యులు చెప్తున్నారు.. ఇప్పటివరకు గుండెపోట్లు ఒక స్థాయి వయసు వారిలో కనిపించగా.. తాజాగా ఓ రెండేళ్ల చిన్నారి గుండెపోటుకు గురైంది..
కర్ణాటక రాష్ట్రంలోని బెలగాం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వచ్చింది. అక్కడ వారు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో బస చేశారు. ఉదయం టిఫిన్ తిని తాజ్ మహల్ చూసేందుకు వచ్చారు. గంగా నది ఒడ్డున వారంతా సరదాగా తిరిగారు. ఈలోగా ఆ కుటుంబంలోని ఓ రెండేళ్ల చిన్నారి ఆకస్మాత్తుగా పడిపోయింది. చాతి దగ్గర నొస్తోందని సైగలు చేసింది. ఆ కుటుంబంలోని వారంతా ఒక్కసారిగా ఆందోళన చెందగా.. పక్కనే ఉన్న ఓ సిఐఎస్ఎఫ్ జవాన్ వెంటనే స్పందించాడు.. వెంటనే సిపిఆర్ చేసి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని ఆగ్రాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే ఆ చిన్నారి హైపోక్సియా కు గురైందని, అందువల్ల గుండెపోటు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.. అకస్మాత్తుగా గుండెపై ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుందని వైద్యులు వివరిస్తున్నారు. “చిన్నారులు జంక్ ఫుడ్ తినడం.. ఆయిల్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడటం.. గంటలపాటు అలాగే కూర్చుని ఉండటం.. శారీరక వ్యాయామం చేయకపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని” వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు చిన్నారులను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.. సమతుల ఆహారంతోనే వారి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.
సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
కర్ణాటకలోని బెలగాంకు చెందిన ఒక కుటుంబం తాజ్ మహల్ చూడటానికి వెళ్లగా, అక్కడ వారి రెండేళ్ల చిన్నారి హైపోక్సియాతో అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయింది.
ఇది గమనించిన సీఐఎస్ఎఫ్ జవాన్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడగా.. ఆస్పత్రిలో… pic.twitter.com/ET5xLBwTKH
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A jawan and doctors saved the life of a two year old child by performing cpr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com