https://oktelugu.com/

NRI News : అమెరికాలో కలకలం.. ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్ యువతి అదృశ్యం

ఈలోగా మరో వాహనం వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ సమయంలో అతని భార్య పక్కనే ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 03:01 PM IST

    telugu-student-Nitheesha-Kandula

    Follow us on

    NRI News : అమెరికాలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. చాలా కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా బయటకి పంపిస్తున్నాయి. ఇందులో భారతీయులు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వారి దృష్టి మరో విధంగా ఉంది.. అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారతీయ విద్యార్థులు మృతి చెందడం, మరికొందరిపై భౌతిక దాడులు జరగడం, ఇంకా కొందరు అదృశం కావడం వాటి సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ సంఘటనలతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

    తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ చెందిన ఓ యువతీ అదృశ్యమైంది. ఉన్నత చదువుల నిమిత్తం ఆ యువతి అమెరికా వెళ్ళింది. హైదరాబాద్ నగరాన్ని చెందిన 23 సంవత్సరాల కందుల నితీష అమెరికాలోని కాల్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతోంది. గత నెల 28 నుంచి ఆమె కనిపించడం లేదని అమెరికా పోలీసులు చెబుతున్నారు.. నితీష కాల్ఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో కనిపించకుండా పోయిందని.. ఆ యువతి ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.. నితీష అదృశ్యం కంటే ముందు అమెరికాలోని చికాగోలో 25 సంవత్సరాల రూపేష్ చంద్ర అనే తెలంగాణ విద్యార్థి కూడా మిస్ అయ్యాడు. అతడు విస్కాన్సిన్ లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు.. ఇక ఇతని కంటే ముందు అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ నగరంలోని 25 సంవత్సరాల హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ మిస్ అయ్యాడు. అనంతరం శవమై కనిపించాడు.

    అయితే ఇలాంటి అదృశ్య సంఘటనలు ఆయా కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలలో చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది ప్రతిక్ష కున్వర్ అనే భారతీయ విద్యార్థి అమెరికాలోని కాన్సాస్ చెనీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ విద్యార్థి బిజినెస్ అనాలసిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. ఇక ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన మరో యువకుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ముందుగా అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు కారు దిగాడు. ఈలోగా మరో వాహనం వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ సమయంలో అతని భార్య పక్కనే ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది.