https://oktelugu.com/

Drunk : బ్రీత్ టెస్ట్ చేస్తే మిషిన్ పట్టుకొని పారిపోయిన తాగుబోతు.. పరేషాన్ లో పోలీసులు..

Drunk : బ్రీత్ ఎనలైజర్ మిషన్ తో సహా పరారయ్యాడు. చీకటి ఉండడంతో కారు నెంబర్ కూడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. అయితే, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Written By: NARESH, Updated On : June 28, 2024 11:03 pm
A drunkard who ran away from the police with a breath test machine

A drunkard who ran away from the police with a breath test machine

Follow us on

Drunk : ‘అసలే కోతి పైగా కల్లు తాగింది’ ఈ సామెత గుర్తుండే ఉంటుంది. వానర జాతి నుంచి వచ్చిన మనిషి కూడా అప్పుడప్పుడే తాగితే చేసే వింత చేష్టలతో నవ్వాలో, ఏడ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒక్కొక్కరు ఒక్కో ఫీట్ చేస్తుంటారు. ఒకరు మందు తాగితే చెట్లెక్కడం.. మరొకరు అడ్డదిడ్డంగా బైక్ నడపడం చేస్తుంటారు. చేష్టలు ఏవైనా అందరికీ కోపం తెప్పిస్తాయి. ఒక్కోసారి నవ్వు కూడా తెప్పిస్తాయి.

గతంలో ఒక తాగుబోతను పోలీసులు పట్టుకున్నప్పుడు ఆయన మాట్లాడిన భాష ఇప్పటికీ కొన్ని రీల్స్ కు ఆడియోను వాడుతూనే ఉన్నారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే బూతులు తిడుతూ లాండ్ ఆర్డర్ ను పాటించరు. తాగితే ఏదైనా చేయచ్చన్న ధైర్యం వస్తుంది కాబోలు అన్నట్లుగా వ్యవహరిస్తారు.

ఏది ఏమైనా తాగి డ్రైవ్ చేయడం నేరం. ఇది వారికి, వారితో పాటు బాటసారులకు, ఇతర వాహదారులకు మంచిది కాదు. అందుకే ఆ విషయంలో పోలీసులు స్ట్రిక్ట్ రూల్ తెచ్చారు. తాగితే వాహనం సీజ్ తో పాటు కోర్టులో ఫైన్ కట్టి వాహనంను తెచ్చుకోవాలనే నిబంధన విధించారు. కొన్ని చోట్ల అక్కడే ఫైన్ కట్టించుకుంటారు.

అయితే ఇటీవల ఒక వింత ఘటన జరిగింది. నిన్న (జూన్ 27) కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్ పల్లి లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక కారు డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు బ్రీత్ ఎనలైజర్ మిషన్ ను నోటిలో పెట్టారు. పోలీస్ అధికారిని నమ్మించి మిషన్ పట్టుకున్న కారు డ్రైవర్ ఒక్క సారిగా మూవ్ అయ్యాడు. దీంతో బ్రీత్ ఎనలైజర్ మిషన్ తో సహా పరారయ్యాడు. చీకటి ఉండడంతో కారు నెంబర్ కూడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. అయితే, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.