Homeక్రైమ్‌Crime News : సెలవు కోసం చంపేశారు... హతుడి వయసు ఐదేళ్లు.. నిందితుల వయసు 9...

Crime News : సెలవు కోసం చంపేశారు… హతుడి వయసు ఐదేళ్లు.. నిందితుల వయసు 9 నుంచి 11 ఏళ్లు.. ఇంత దారుణమా?

Crime News :  మనిషుల్లో మానవత్వం మాయమైపోతోంది. ఒకప్పుడు సొంతవారికన్నా.. ఎదుటి వారికి సాయం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపేవారు. నాటి రోజుల్లో టీవీలు, సెల్‌ఫోన్లు లేవు. ఒకటి కష్టసుఖాలు మరొకరు తెలుసుకునేవారు. అన్నీ పంచుకునేవారు. టీవీ వచ్చాక.. మాట్లాడుకోవడం కాస్త తగ్గింది. సామాజిక దూరం పెరగడం ప్రారంభమైంది. ఇక సెల్‌ఫోన్‌ వచ్చింది. ఇది అన్నింటినీ దూరం చేస్తోంది. సమాజంతో, ఇరుగుపొరుగువారినే కాదు.. ఒకే ఇంట్లో భార్య, భర్తల మధ్య, ఒకే ఇంట్లో పిల్లలు, పేరెంట్స్‌ మధ్య దూరం పెంచింది. మన చేతికి ఉన్న వాచ్‌ను దూరం చేసింది. పిల్లలను పుస్తకాలకు దూరం చేసింది. బంధుత్వం, బంధాలను తినేసింది. చివరకు కలిసి సినిమా చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక ఇదే సెల్‌ఫోన్‌ మనిషిలోని మానవత్వాని మొత్తం తినేసింది. క్రూరత్వాని, లైంగిక వాంఛను పెంచి పోషిస్తోంది. తెలియని విషయాలను తెలుపుతుంది కదా అనుకుంటే.. మంచి విషయాలకన్నా చెడు విషయాలనే ఎక్కువగా చెబుతుంది. దీంతో మనుసుల మధ్య బంధాలు దూరమవుతున్నాయి. చిన్న పిల్లలను సైతం నేరస్థులుగా మారుస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

సెవలు కోసం హత్య..
తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ చిన్నపిల్లల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనికి ఉదాహరణే ఢిలీ లో జరిగిన సంఘటన. దయాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తాలిమ్‌ ఉల్‌ ఖురాన్‌ అనే మదర్సాలో విద్యార్థులు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. హత్య చేసిన వారి వయసు కేవలం 9 నుంచి 11 ఏళ్లు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 5 ఏళ్ల చిన్నారి రుహాన్‌ అపస్మారక స్థితిలో ఉన్నట్టు మదర్సా డైరెక్టర్‌ గమనించారు. దీంతో ఆయన పిల్లాడి తల్లికి ఫోన్‌ చేసి చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్‌ను ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్‌ చిన్నారిని పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో రుహాన్‌ తల్లిదండ్రులు, బంధువులు మదర్సా బయట నిరసనలు చేశారు. ఆందోళనల గురించి తెలుసుకున్న పోలీసులు మదర్సాకు చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీన పరుచుకోవడంతోపాటూం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారభించారు.

పోస్టుమార్టంలో షాకింగ్‌ నిజం..
మరోవైపు రుహాన్‌ మృతదేహానికి పోస్ట్‌ మార్టమ్‌ నిర్వహించారు. ఇందులో చిన్నారి హత్యకు గురైనట్లు తెలిసింది. తర్వాత పోలీసులు మదర్సా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో తేలిందేమింటే.. మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్‌తో అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసారు. విద్యార్ధి చనిపోతే మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించి..రుహాన్‌ను హత్య చేశారు. ప్రస్తుతం నిందితలైన చిన్నారులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular