Homeక్రైమ్‌2.15 Crore Robbery Case: 2.15 కోట్ల చోరీ.. దొంగలిలా దొరికారు.. సినిమా స్టైల్ లో...

2.15 Crore Robbery Case: 2.15 కోట్ల చోరీ.. దొంగలిలా దొరికారు.. సినిమా స్టైల్ లో రియల్ క్రైం స్టోరీ

2.15 Crore Robbery Case: పెద్ద ఓడను సముద్రంలో ముంచేది చిన్న చిల్లే.. అలాగే పెద్దపెద్ద దొంగలను సైతం చిన్న క్లూ పోలీసులకు పట్టిస్తుంది. అలాంటిదే ఈ సంఘటన కూడా.. పైగా ఈ ఉదంతంలో దొంగలు ఏకంగా డబ్బు, స్వర్ణాన్ని దొంగిలించారు.. దాని విలువ 2.15 కోట్లు. ఈ సంఘటన కర్ణాటకలోని కలబురిగి ప్రాంతంలో చోటుచేసుకుంది.. ఈనెల 11న ఈ సంఘటన జరగగా.. కేసును చేదించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. వారు ఇంత లోతుగా శోధిస్తున్నప్పటికీ దొంగలు మాత్రం దొరకడం లేదు. వారి ఆచూకీ లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఒక చిన్న క్లూ దొంగలను పట్టించింది.

ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పైగా పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో దొంగలను పట్టుకోవడం కష్టమైపోయింది. అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ దొంగల ఆచూకీ పోలీసులకు లభించలేదు. పైగా జరిగిన చోరీ విలువ రెండు కోట్లకు పైగా ఉండడంతో పోలీసులకు ఈ కేసు అత్యంత సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి ఈ కేసును చేదించడం మొదలుపెట్టారు. అయితే ఏ దిశగా కూడా వారికి అనుకూలమైన ఫలితాలు రాలేదు.. చివరికి ఒక చిన్న ఆధారం ఈ కేసులో పురోగతి కలిగేలా చేసింది. ఆ తర్వాత పోలీసుల ఆలోచన తీరును మార్చి.. కేసు గతిని మరోవైపు తీసుకెళ్లింది.

Also Read: రెండు నెలల క్రితం కూతురికి పెళ్లి.. అల్లుడితో కలిసి ఈ అత్త చేసిన పని సంచలనం!

కలబురిగి ప్రాంతంలో మారతుల్లా మాలిక్ వ్యక్తికి బంగారం దుకాణం ఉంది. ఈ దుకాణంలో అయోధ్య ప్రసాదు చౌహాన్, ఫరూక్ అహ్మద్ మాలిక్, సోహైల్ షేక్, ఫారుక్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. మాస్కులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఈనెల 11న ఈ ఘటన జరిగింది. ఈ దోపిడీకి ఫారుక్ సూత్రధారిగా వ్యవహరించాడు. గేటు బయట కాపలా కాశాడు. మిగతావారు దుకాణం లోపలికి వెళ్లి.. యజమానిని బంధించారు. లాకర్ లో ఉన్న 2.865 కిలోల బంగారాన్ని, నగదును మూట కట్టారు. ఆ తర్వాత వాటిని తమ వెంట తీసుకువెళ్లిపోయారు. ఆ తర్వాత ఫారుక్ ఆకలిగా ఉండడంతో పావ్ బజ్జీ సెంటర్ కి వెళ్ళాడు. అక్కడ ఒక ప్లేట్ పావ్ బజ్జి తిన్నాడు. 30 రూపాయలు బిల్ కావడంతో ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత మిగతా దొంగలతో కలిసి వెళ్లిపోయాడు. అయితే పోలీసులకు ఈ సిసి ఫుటేజ్ రికార్డు అత్యంత కీలక ఆధారంగా లభించింది. అంతేకాకుండా వారి కదలికల మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులు ఫోన్ పే లావాదేవీల గురించి ఆరా తీశారు. అనంతరం బ్యాంకు అధికారులను సంప్రదించి ఫారుక్ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈనెల 21న ఫారుక్ ను అరెస్ట్ చేశారు. మిగతా దొంగలను కూడా పట్టుకున్నారు.. మొత్తంగా ఫోన్ పే ఆ దొంగలను పట్టించింది. దొంగల నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బాధితుడికి అప్పగించారు. అంతర్రాష్ట్ర ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న నేపథ్యంలో పోలీసులకు ప్రశంసలు లభిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular