India Corona Cases: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పాజిటివిటీ రేటు తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేసింది. వరుసగా నాలుగో రోజు మూడు లక్షల దిగువనే కేసులు నమోదవుతున్నాయి. కానీ ఇంకా ప్రజలు భయభ్రాంతుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మహారాష్ర్ట, ఢిల్లీల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ స్టేట్లలో పాజిటివిటీ రేటు ఎక్కువగానే నమోదవుతోంది. దీంతో కేరళలో 94 శాతం పాజిటివిటీ రేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో మూడో దశ ముప్పు ఏర్పడిందని తెలుస్తోంది.
మరోవైపు కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. కానీ మరణాల రేటు మాత్రం పెరుగుతోంది. దీంతో గడచిన 24 గంటల్లో 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజల్లో మరోమారు ఆందోళనలు పెరుగుతున్నాయి. రికవరీల రేటు కూడా పెరుగుతున్నా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకరమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో మొదలైన కరోనా కల్లోలం..రోజుకు ఎన్ని కేసులంటే?
కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది కాస్త ఊరటనిస్తున్నా వైరస్ వ్యాప్తి మాత్రం తన ప్రభావం కొనసాగిస్తోంది. ఫలితంగా దేశంలో కేసుల సంఖ్యపై ప్రజల్లో భయం పట్టుకుంది. వ్యాధి బారిన పడిన వారి కంటే కోలుకున్న వారు ఎక్కువగా ఉండటం తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని స్టేట్లు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. దీంతో వైరస్ తీరుపై ప్రజల్లో రోజురోజుకు భయాందోళనలు రెట్టింపవుతున్నాయి.
ఒకవైపు టీకాలు వేస్తున్నా మరోవైపు వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. డోసులు వేసుకున్నా వేరియంట్ ఆగడం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కేసుల సంఖ్య ఆగడం లేదు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నా ఎవరు పాటించడం లేదు. ఫలితంగానే కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోందని తెలుస్తోంది.
Also Read: AP Corona Cases: ఏపీని ఆవహిస్తోన్న కరోనా.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు.. రోజుకు ఎన్ని కేసులా?