
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని పుట్టుక గురించి స్పష్టమైన ప్రకటన రావడం లేదు. దీంతో ఈ మహమ్మారి పుట్టుక పూర్వోత్తరాలపై ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. చైనాలోని వూహాన్ లో మొదలైన ఈ వ్యాధి ప్రపంచమంతా విస్తరించింది. ఈ సార్స్ కోవ్ 2 వైరస్ పుట్టుక ఎక్కడ? ఎలా జరిగిందన్న దానిపై సమాధానం లేదు. వైరస్ కాకతాళీయంగా ఏర్పడిందా? లేక సృష్టించిందా అన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం తెలిసిందే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం వూహాన్ కు వెళ్లి పరిశీలన చేసింది. ఈ వైరస్ అడవిజంతువుల నుంచి వచ్చిందా? జంతు వధ శాల నుంచి వచ్చిందా అని ఆరా తీసింది. ఇటీవల అమె రికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఈ వైరస్ పుట్టుక తుట్టెను కదిపారు. మూడు నె లల కాలంలో ఈ అంశంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
వూహాన్ లోని ద వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఈ వైరస్ యాదృశ్చికంగా వచ్చిందా లేదా ఉద్దేశపూర్వకంగా బయట పడిందా అనే విషయం బోధపడడం లేదు. చైనాలోనే అతిపె ద్ద బయాలజికల్ రీసెర్చి సెంటర్ కావడం గమనార్హం. కరోనా వైరస్ ను గుర్తించిన వైరస్ ను మొట్టమొదటిసారి గుర్తించిన హువాన్ జంతు వధ శాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికాలోని పలు వార్తా పత్రికలు వూహాన్ పరిశోధన శాల కుట్ర కోణంలో వార్తలు ప్రచురించడంతో చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్లోనే కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు తెలుస్తోంది.
అమె రికా చె ప్పేదంత అబద్దమని చైనా వాదిస్తోంది. పరిశోధన శాల నుంచి తప్పించుకుందనడం తమపై బురద జల్లడమేనని బుకాయిస్తోంది. ఇతర దేశాల ఆహారం ద్వారా మా దేశంలోకి చొరబడిందని ప్రత్యారోపణలు చేస్తోంది.2015 మార్చిలోనే కరోనా వైరస్ గుర్తించామని ప్రొఫె సర్ షి ఝింగ్లీ గత వారమే ఓ పరిశోధన వ్యాసాన్ని రాశారని చెబుతోంది.
కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్ర విచారణ జరిపించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. చైనాలో కరోనా వైరస్ ఎలా వచ్చిందో నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. అమెరికా, ఆస్టేలియాలతో పాటు పలు దేశాలు కరోనా వైరస్ మూలాలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ మూలాలపై మార్చిలో డబ్ల్యూటీవో ఒక నివేదక వెలువరించినా ప్రపంచ దేశాలు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు.