
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజుకు 4 లక్షలకు అటూఇటుగా నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో బెడ్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో చాలామంది బెడ్లు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా, కరోనా నిర్ధారణ అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సొంతవైద్యం చేసుకుంటూ కొంతమంది ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేలా చేసుకుంటున్నారు.
వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం మందులను వాడి ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. సొంతంగా ఔషధాలను వాడటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. డాక్టర్లను సంప్రదించకుండా కరోనా రోగులు మందులు వాడితే ఇబ్బందులు పడక తప్పదు. సొంతంగా మందులు వాడితే మరింత ముప్పు అని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
కరోనా సోకిన వాళ్లు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ సమయంలోనే వైరస్ నుంచి కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా రెమ్ డిసివర్ ను వాడటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. డ్రగ్స్ విషయంలో సమాచార లోపం తీవ్రంగా ఉండటం వల్ల కూడా ప్రజలు ఇష్టానుసారం మందులను, విటమిన్ ట్యాబ్లెట్లను వాడుతూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
కరోనా సోకిన వాళ్లలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లు, వయోధికులకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా సోకిన వాళ్లు పల్స్ ఆక్సీమీటర్ సహాయంతో ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే తక్కువగా ఉంటే ఆస్పత్రిలో చేరాలి.