Delta Omicron: కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ప్రపంచంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్ భయాలు ఇక అయిపోయాయి అనుకునే లోపే మరో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. దాంతో జనం ఇంకా భయాందోళన చెందే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఈ వేరియంట్స్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ హెచ్చరించింది. ఆ క్రమంలోనే ప్రపంచంలో భయానక పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి.
Delta Omicron
తాజాగా డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్స్ కలిసి మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీనిపేరు ‘డెల్ట్రాక్రాన్’. కాగా, ఈ వేరియంట్ తొలి కేసులు సైప్రస్‌లో నమోదయ్యాయి. ఈ డెల్టాక్రాన్ స్ట్రెయిన్‌ను సైప్రస్ యూనివర్సిటీ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ ప్రొఫెసర్, ల్యాబోరేటరీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ వైరాలజీ డీన్ లియోండియోస్ కోస్ట్రికిస్ గుర్తించారు. ఈ ఒమిక్రాన్, డెల్టా కో-ఇన్ఫెక్షన్ కేసులు సైప్రస్‌లో పుట్టుకొచ్చినట్లు స్పష్టం చేశారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ కాంబినేషన్స్ ఇందులో కనిపించాయని వివరించారు.
Also Read: ఒమిక్రాన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్?
ఈ కొత్త వేరియంట్‌కు డెల్టా వేరియంట్ తరహా జన్యు నేపథ్యం ఉందని, ఇందులో కొన్ని ఒమిక్రాన్ మ్యుటేషన్లను కనుగొన్నామని చెప్పారు. మొత్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌తో నే జనాలు హడలిపోతున్న ఈ సందర్భంలో మరోకొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దాంతో జనాలు మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు సైప్రస్‌లో ఒకేసారి 25 వరకు ఈ డెల్ట్రాకాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని లియోండియోస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపోతే ఈ డెల్టాక్రాన్ కొవిడ్ వేరియంట్ లక్షణాలు ఎటువంటివనే విషయమై ఇంకా స్పష్టత అయితే రాలేదు. దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇకపోతే సైప్రస్ మంత్రి మంత్రి హడ్జిపాండేలాస్ మాట్లాడుతూ.. ఈ వేరియంట్ విషయమై యూనివర్సిటీ నుంచి నివేదికలను తెప్పించుకున్నామని వివరించారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల భయపడాల్సిన పని లేదని, అయితే, దీనిపై పూర్తి అధ్యయనం తర్వాతనే స్పందిస్తామని చెప్పారు. ప్రజలకు నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు.
Also Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: సీఎంలతో మోడీ భేటి..దేశంలో సంపూర్ణ లాక్ డౌన్?