చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలై ఏడాదిన్నర అయింది. ప్రపంచ దేశాలను గజగజా వణికించిన కరోనా ఉధృతి తగ్గుతుందని ప్రజలు భావిస్తే ఈ ఏడాది వేసవి కాలంలో శరవేగంగా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలం వైరస్ విజృంభణకు అనువైన సమయం కాగా కరోనా వైరస్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కరోనాకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: ఈ పని చేస్తే కరోనా సోకే అవకాశాలు తక్కువ.. ఏమిటంటే..?
కరోనా వైరస్ శరీరంలోని అనేక అవయవాలపై ఇప్పటికే ప్రభావం చూపుతుండగా నోటి కణాలపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతున్నట్టు శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలు వెల్లడించారు. నోటిలోని కణాలపై కరోనాకు కారణమయ్యే సార్స్-కోవ్-2 ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.
Also Read: కరోనా ఎఫెక్ట్.. బెంగళూరు వెళ్లేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ?
వైరస్ అధికంగా ఉన్న లాలాజలాన్ని మింగితే గొంతు, ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర అవయవాలకు కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ కెవిన్ ఎం బెయార్డ్ ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి నోటి కణాలు కారణమని నిర్ధారించడం కొరకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు లాక్ డౌన్ కంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయడం మంచిదని చెబుతున్నారు