Covid-19 Vaccines- Attack Deaths: ప్రపంచానికి కరోనా గుణపాఠమే నేర్పింది. మనుషులు ఎలా ఉండకూడదో చెప్పింది. క్రమశిక్షణతో ఎలా నడుచుకోవాలో సూచించింది. 2020-21 సంవత్సరాల్లో కరోనా ప్రజలను కకావికలం చేసింది. ప్రజల్లో దడ పుట్టించింది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. దీనికి చాలా మంది బలయ్యారు. కరోనా ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ తో అందరు ఇళ్లకే పరిమితమైపోయారు. రోజుల తరబడి ఇళ్ల్లల్లో మగ్గుతూ బయటకు రాలేకపోయారు. ఎంతో మంది ఎన్నో అవస్థలు పడ్డారు. ఇతర రాష్ట్రాల వారైతే తమ సొంతూళ్లకు వెళ్లేందుకు నానా అగచాట్లు ఎదుర్కొన్నారు.
Covid-19 Vaccines
కరోనా నియంత్రణకు టీకాలు తయారు చేశారు. దీంతో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోసు లుగా వేసుకున్నారు. దీంతో కరోనా మహమ్మారి కంట్రోల్ కు వచ్చింది. కానీ టీకాలతో గుండె జబ్బుల ముప్పు మాత్రం ఎక్కువైపోయింది. అమెరికాలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకున్న 18-39 ఏళ్ల వయసున్న వారికి ఇచ్చిన టీకాలతో గుండెపోటు ముప్పు మాత్రం ఎక్కువైందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. భారత్ లో మాత్రం ఎంఆర్ఎన్ఏ టీకాలు వినియోగించలేదు. సంప్రదాయ పద్ధతిలో వేసిన టీకాలతో ఇలాంటి ముప్పు మాత్రం లేదు.
ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తరువాత హృదయ సంబంధ రోగాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ దాదాపు 84 శాతం మంది ఇలాంటి రోగాలతో మరణించినట్లు అద్యయనాలు తెలియజేస్తున్నాయి. అగ్రదేశాలన్ని ఈ టీకాను వేసుకోవడంతో వారికే ముప్పు పొంచి ఉంది. ఈ టీకా వేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గుండె సంబంధ రోగాలు ఉన్న వారు కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న వారు ఎలాంటి ఇబ్బందులున్నా తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు.
Covid-19 Vaccines
ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై (సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. టీకాలు వేయించుకున్న వారు భద్రంగా ఉండాలని సూచిస్తున్నారు. 18-39 వయసు మధ్య ఉన్న వారు తీసుకున్న టీకాతో గుండె జబ్బుల ముప్పును తొలగించుకునేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారు అప్రమత్తంగా ఉండి తమ జబ్బులకు సరైన సమయంలో చికిత్సలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.