Covid Deaths: అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి కకావిలకం అవుతోంది. మొదటి దశలో కొనసాగిన ప్రమాదకర స్థాయి ప్రస్తుతం కూడా వెంటాడుతోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర రూపం దాల్చడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. నిబంధనలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరడం ఆందోళన కలిగించే అంశమే. నిపుణుల అంచనాల ప్రకారం త్వరలోనే ఐదు లక్షల వరకు చేరతాయని హెచ్చరికలు జారీ చేయడంతో అమెరికా వాసుల్లో భయం నెలకొంది. యూఎస్ లో ఇప్పుడు ప్రతి రోజు సగటున 1.98 లక్షలు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో కొవిడ్ మహమ్మారి మరోమారు అగ్రరాజ్యాన్ని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో మూడో దశ ముప్పు వచ్చినట్లేననే సంకేతాలు వస్తున్నాయి. బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లోనే కాకుండా దాదాపు వందకు పైగా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపిస్తున్నందున మూడో దశ ముప్పు వచ్చిందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: కరోనా బారిన పడిన మాజీ మిస్ ఇండియా… మానస వారణాసి
అమెరికాలో రోజుకు 1408 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఇది 17 శాతం పెరుగుదలగా చెబుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇప్పటికే దాదాపు 71 వేల మంది ఆస్పత్రుల్లో చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. భవిష్యత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా ఏ మేరకు విస్తరిస్తుందోనని అంటున్నారు.
ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ప్రమాదకరమేనని సూచిస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ ను నిరోధించే క్రమంలో అందరు సహకరించాలని కోరుతున్నారు. వేడుకలు అట్టహాసంగా కాకుండా పరిమిత సంఖ్యలోనే ఉండాలని చెబుతున్నారు.
Also Read: తెలంగాణలో ‘ఒమిక్రాన్’ ఆంక్షలు.. వేడుకల్లేవ్.. ఇక ఇవి పాటించడం తప్పనిసరి