Steroids Side Effects: 2021లో మనదేశంలో కోవిడ్ ఎలా విజృంభించిందో చూశాం కదా. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడి పోయాయి. ముఖ్యంగా డయాబెటిక్ తో బాధపడుతూ కోవిడ్ బారిన పడినవారు నరకం చూశారు.. అయితే వీరికి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల దేహంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి చాలామంది కన్నుమూశారు. మరి కొంతమంది కోవిడ్ తగ్గినప్పటికీ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కొంతమంది కన్నుమూయగా.. మరి కొంతమంది శాశ్వతంగా చూపును కోల్పోయారు.
విచ్చలవిడి స్టెరాయిడ్స్ తో..
కోవిడ్ సమయంలో మనదేశంలో బ్లాక్ ఫంగస్ విజృంభించేందుకు కారణం చికిత్సలో భాగంగా గ్లూకో కార్టి కాయిడ్స్ ను విచ్చలవిడిగా వాడటం వల్లే అని తెలిసింది.. కోవిడ్ బారిన పడిన కొందరిలో మధుమేహం అదుపులో లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా తెలిసింది.. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ మన దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వివిధ రాష్ట్రాల్లోని 25 ప్రముఖ ఆస్పత్రుల్లో అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా ఆ 25 ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 1733 మంది బ్లాక్ ఫంగస్ రోగులతో పాటు, 3911 మంది కోవిడ్ రోగుల వివరాలు పరిశీలించింది. ఆ అధ్యయనం కోసం 15 అంతకుమించి బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స చేసిన ఆసుపత్రులను ఎంచుకుంది.. వాటిలో హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యశోద ఆసుపత్రులు ఉన్నాయి.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత 14 రోజుల్లో పే బ్లాక్ ఫంగస్ బారినపడ్డ కేసులనే ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నారు.
అవసరానికి మించి
అయితే ఆ రోగులకు అవసరానికి మించి స్టెరాయిడ్స్, జింక్ ఇచ్చారని గుర్తించారు. కొందరిలో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం, ఇతర సమస్యలు కూడా బ్లాక్ ఫంగస్ కు కారణమయ్యాయని గుర్తించారు.. మూత్రపిండ మార్పిడి చేయించుకున్న వారిలో కూడా ఈ సమస్య అధికంగా ఉందని ఆ బృందం సభ్యులు తెలిపారు.. ఒకవేళ మధుమేహం ఉన్నప్పటికీ అది నియంత్రణ స్థాయిలోనే ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ సమస్య రాలేదని తెలిపారు. అదుపులో లేని షుగర్ వల్ల 47.5 మంది దాని బారిన పడినట్టు గుర్తించారు. ఇక ఇంటి దగ్గరే తీసుకుంటూ అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడిన 34 శాతం మంది ఈ సమస్య బారిన పడినట్టు అధ్యయనంలో తేలింది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన 48 శాతం మంది జింక్ సప్లిమెంట్ తీసుకోవడం వల్లే తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని బృందం సర్వేలో వెల్లడైంది. స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగి ఇమ్యూనిటీ తగ్గిందని గుర్తించారు.. బ్లాక్ ఫంగస్ బారిన పడినవారిలో 30 శాతం మంది చనిపోయినట్టు బృందం గుర్తించింది. అయితే అప్పట్లో స్టెరాయిడ్స్ కనుక వాడకపోయి ఉంటే చాలామంది మధుమేహ రోగులు బతికేవారు. కోవిడ్ కట్టడికి ఒక నిర్దిష్టమైన వైద్య విధానం అంటూ లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో ఇష్టా రాజ్యంగా ప్రవర్తించాయి. ప్రస్తుతం చైనాలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో మధుమేహ రోగులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Many people would have survived if steroids were not used during corona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com