Covid 3rd Wave: మూడో దెబ్బ అంటే ఇక కోలుకోవడం కష్టమే !

Covid 3rd Wave: కరోనా సెకండ్ వేవ్ పోయింది, పైగా అఖండ తో బాక్సాఫీస్ గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి, ఇక వరుస భారీ సినిమాల రిలీజ్ ఖాయం అనుకున్నాం. మేకర్స్ కూడా ఇదే ఉత్సాహంతో ఉన్నారు. కానీ, ఆ ఉత్సాహం ఆవిరి అయిపోయేలా ఉంది. ఇప్పుడిప్పుడే భారీ చిత్రాల నిర్మాతలకు ధైర్యం వస్తోంది అనుకుంటే.. అంతలో కరోనా థర్డ్ వేవ్ జాడ మళ్ళీ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో వరుస ఒమిక్రాన్ కేసులతో మొత్తానికి మూడో […]

Written By: Shiva, Updated On : December 4, 2021 5:08 pm
Follow us on

Covid 3rd Wave: కరోనా సెకండ్ వేవ్ పోయింది, పైగా అఖండ తో బాక్సాఫీస్ గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి, ఇక వరుస భారీ సినిమాల రిలీజ్ ఖాయం అనుకున్నాం. మేకర్స్ కూడా ఇదే ఉత్సాహంతో ఉన్నారు. కానీ, ఆ ఉత్సాహం ఆవిరి అయిపోయేలా ఉంది. ఇప్పుడిప్పుడే భారీ చిత్రాల నిర్మాతలకు ధైర్యం వస్తోంది అనుకుంటే.. అంతలో కరోనా థర్డ్ వేవ్ జాడ మళ్ళీ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

Covid 3rd Wave

బెంగళూరులో వరుస ఒమిక్రాన్ కేసులతో మొత్తానికి మూడో ముప్పు భయాలు గంటగంటకు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ అనే కొత్త రకం వైరస్ ప్ర‌పంచ దేశాల్ని ఒణికిస్తోంది. నెమ్మదిగా భారత్ వైపు కూడా అడుగులు వేసింది. అన్నిటికి మించి ఈ వైర‌స్ ఉధృతి అతి తీవ్రంగా ఉండేలా ఉంది.

డ‌బ్ల్యూ హెచ్ ఓ కూడా ఇప్పటికే ఘాటుగా ఈ విషయంలో హెచ్చ‌రించింది. ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళను ఎక్కువ భయపెడుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా, ముందుగా నాయకులకు గుర్తుకు వచ్చేది థియేట‌ర్లు మాత్రమే. సోష‌ల్ డిస్టెన్స్ అనగానే ప్ర‌భుత్వాలు చేసే ముందు పని థియేటర్స్ ను క్లోజ్ చేయడం.

ఏపీలో టికెట్ రేట్లు సగానికి సగం తగ్గించి, సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ కొట్టిన జగన్, ఇప్పుడు థియేటర్స్ ను కూడా క్లోజ్ చేసి మొత్తంగా కోలుకోలేని దెబ్బ కొడతాడేమో అని చిత్ర నిర్మాతలు, హీరోలు ఆందోళన చెందుతున్నారు. అసలుకే తెలుగు చిత్ర‌సీమ‌కు డిసెంబ‌రు నుంచి వచ్చే ఆరు నెలలు చాలా కీల‌కం. ఎందుకంటే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కి సిద్ధం అయ్యాయి.

Also Read: పిల్లలలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా.. కచ్చితంగా డెంగ్యు కావచ్చు!

ఎలాగూ పుష్ప‌, ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగ‌రాయ్‌, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుద‌లకు దగ్గర పడ్డాయి కాబట్టి.. ఆ చిత్రాలకు వచ్చిన సమస్య ఏమి ఉండదు. కానీ ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు మరో రెండు నెలలు సమయం ఉంది. అప్పటిలోపు మళ్ళీ థియేటర్స్ ను మూసేయాల్సిన పరిస్థితి వస్తే ? ఇక నిర్మాతలకు భారీ నష్టాలే.

అసలుకే, మన నాయకులు బార్లు, వైన్ షాప్ లను క్లోజ్ చేయకపోయినా.. థియేటర్స్ ను మాత్రం కచ్చితంగా క్లోజ్ చేస్తారు. ఇప్పటికే రెండు దెబ్బలు తిన్న ఇండస్ట్రీకి మరి మూడో దెబ్బ తింటే ఇక కోలుకోవడం కష్టమే.

Also Read: నిర్లక్ష్యానికి ‘ఒమిక్రాన్’ మూల్యం

Tags