
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. కరోనా సోకకుండా ఉండాలని ప్రజలు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతామని కొంతమంది భావిస్తున్నారు. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనుకునే విషయంలో గందరగోళానికి గురవుతున్నారు.
కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా కరోనా సోకిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు నీళ్లను వీలైనంత ఎక్కువగా తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి. ఇలా చేయడం వల్ల వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉండటంతో పాటు నీరసం తగ్గి శరీరం పునరుత్తేజం అవుతుంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారు ఆల్కహాల్ కు దూరంగా ఉండటంతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఆల్కహాల్ డ్రింక్ చేస్తే శరీరం డీహైడ్రేషన్‌కు గురి కావడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అందువల్ల ఆల్కహాల్ తీసుకోకూడదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
ప్రాసెస్‌డ్ ఫుడ్స్ లో ఉండే అధిక క్యాలరీలు, సంతృప్త కొవ్వులు ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రాసెస్‌డ్ ఫుడ్ కు బదులుగా గోధుమలను ఆహారంగా తీసుకుంటే మంచిది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడంతో పాటు చక్కెరస్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి.