Corona 4th Wave: కరోనా కథ ముగిసినట్లే అని సంబరపడిపోతున్నా కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలను కంగారు పెడుతూనే ఉంది. తాజాగా కొత్త వేరియంట్ పుట్టడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేరియంట్లలో సబ్ వేరియంట్లతో కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి నాలుగో దశ ప్రారంభం కానుందని హెచ్చరికలు వస్తున్న సందర్భంలో కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారనుంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు.
Corona Virus
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా గుర్తించారు. దీంతో పది శాతం వృద్ధిరేటు నమోదు చేస్తోందని డబ్ల్యూహెచ్ వో తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో వెల్లడిస్తోంది. కొత్త వేరియంట్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది. ఈ వేరియంట్ ను మొదటిసారి యూకేలో జనవరి 19న గుర్తించినట్లు తెలుస్తోంది. యూకేలో ప్రమాదకరస్థాయిలో వైరస్ తీవ్రత ఉందని చెబుతున్నారు.
Also Read: Malaika Arora Injured In Car Accident: హీరోయిన్ కి కారు ప్రమాదం.. అసలేం జరిగిందంటే ?
యూకేలో దాదాపు 49 లక్షల కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యలో ఎక్స్ ఈ వైరస్ తో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఎక్స్ ఈ వైరస్ తీవత్రపై నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్రిటన్ లో ఆందోళన కలిగిస్తున్న వైరస్ తో ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు. వైరస్ పై ప్రయోగాలు చేస్తున్నట్లు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ వెల్లడించారు.
Corona Virus
ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలతోనే ఎక్స్ ఈ వైరస్ ఉండటం గమనార్హం. ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్లో వీ1, 1.529, బీఏ 1, బీఏ2, బీఏ3 సహా నాలుగు వేరియంట్లు కలిగి ఉందని చెబుుతన్నారు. దీంతో ఎక్స్ ఈ వేరియంట్ ప్రభావంతో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓదార్పు యాత్రలో పవన్ కళ్యాణ్