
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. కరోనా పేరు చెబితేనే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నా కరోనా కొత్త కేసులు మాత్రం నమోదవుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే కరోనా వైరస్ కు ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు కూడా వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. అయితే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లకు తోడుగా ఒక మందును తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొలం గట్ల వద్ద పెరిగే అడ్డ సరం మొక్క కరోనా నివారిణిగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరైతే కరోనా బారిన పడతారో వారిలో ఆక్సిజన్ లెవెల్స్ భారీగా తగ్గుతాయనే సంగతి తెలిసిందే.
కొంతమంది కరోనా రోగులలో రక్తం గడ్డ కట్టడం, ఊపిరితిత్తులోని కణజాలం దెబ్బతినడం ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే అడ్డసరం మొక్క ఈ లక్షణాలను తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతోంది. మేలు చేసే జన్యువులకు సహాయపడే గుణాలు ఈ మొక్కలో ఉండటం గమనార్హం. రెస్పిరేటరీ రీసెర్చ్ పబ్లికేషన్‌లో ఈ మొక్క అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం ఆయుర్వేద వైద్యులు ఈ మొక్కను విరివిగా వినియోగించడం జరుగుతుంది. మొక్క ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. జలుబు, దగ్గు, ఉబ్బసం లాంటి సమస్యలకు అడ్డరసం మొక్క చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.