https://oktelugu.com/

Omicron: ఒమిక్రాన్ పై ఏపీ సర్కార్ అలర్ట్.. రేపటి నుంచి ఇంటింటి సర్వేకు రెడీ

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ విస్తరిస్తోంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించాలని భావించింది. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో 12 మందికి, ఏపీలో ఒకరికి సోకింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది. వైరస్ వేగంగా విస్తరించకుండా చేసేందుకు తన చర్యల్లో భాగంగా మూలాలు గుర్తించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 19, 2021 / 02:37 PM IST
    Follow us on

    Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ విస్తరిస్తోంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించాలని భావించింది. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో 12 మందికి, ఏపీలో ఒకరికి సోకింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది. వైరస్ వేగంగా విస్తరించకుండా చేసేందుకు తన చర్యల్లో భాగంగా మూలాలు గుర్తించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

    Omicron

    ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వంద దాటడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. వేరియంట్ వేగంగా విస్తరిస్తోన్నా దాంతో ప్రమాదకరమైన పరిస్థితులు మాత్రం లేవని వైద్యులు చెప్పడం కొంత ఊరట కలిగిస్తోంది. అయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగానే ఏఎన్ఎం, ఆశావర్కర్లు, వలంటీర్లు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అనుమానితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Also Read: ఒమిక్రాన్ లాక్ డౌన్ మొదలైంది..యూరప్ లో ఆంక్షలు
    విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకడంతో రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తూ ఎవరికైనా లక్షణాలు ఉంటే తక్షణమే ఆస్పత్రులకు పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఒమిక్రాన్ వేగాన్ని నియంత్రించే పనిలో పడింది.

    సాధారణ జ్వరం ఉంటే మాత్రలు, ఔషధాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించడానికి డోర్ టు డోర్ తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేరియంట్ పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరం గుర్తించనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.

    Also Read: పిల్లలపై మామూలుగా లేదుగా?

    Tags