Manchu Lakshmi: ప్రముఖ టాలీవుడ్ నటి మంచు లక్ష్మీకి యాక్సిడైంట్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్త వినిపిస్తోంది. తాజాగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా తన చేతి వేళ్లకు రక్తం కారుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది లక్ష్మి. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీకి అసలు ఏమైందంటూ అభిమానులు ఆరాతీయడం ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది రియల్ యాక్సిడెంట్ కాదని.. రీల్ యాక్సిడెంట్ అని సమాచారం.

ప్రస్తుతం మంచు లక్ష్మీ ఫుల్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. మలయాళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది ఈ భామ. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తోన్న సినిమాలో మంచులక్ష్మీ కీలక పాత్రల పోషిస్తోంది.. ఈ క్రమంలోనే షూటింగ్లో భాగంగా ఫైట్ సీన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా షూటింగ్లో వేసిన మేకప్ ఫొటోలు తీసి మంచు లక్ష్మీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు అందరూ లక్ష్మీకి నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందని అనుకున్నారు. అభిమానులైతో కంగారుతో ఏమైంది?.. ఎలా ఉన్నారు?.. అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే సస్పెన్స్‌ను రివీల్ చేస్తూ.. తను పెట్టిన ఆ ఫొటోలు షూటింగ్లోనివని క్లారిటీ ఇచ్చింది లక్ష్మీ. దీంతో చాలా మంది నాకోసం పరితపిస్తున్నారని తెలిసింది. మీ అందరీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. సినిమాలో నటించే ముందు పలు షోలకు యాంకర్‌గానూ వ్యవహరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది మంచు లక్ష్మి.