
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అంచనాలకు అందని స్థాయిలో అడ్డూఅదుపు లేకుండా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజల్లో కరోనా భయం గతంతో పోలిస్తే కొంత తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడిన వాళ్ల ప్రాణాలకే ముప్పు అని తెలుస్తోంది.
Also Read : తారల చీకటి బాగోతం: డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సెక్స్ రాకెట్?
తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ విషయంలో శుభవార్త చెప్పారు. ఆయుర్వేద ఔషధాలు కరోనాను కట్టడి చేయడంలో సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని మూడు ఆస్పత్రుల్లో ఆయుర్వేద ఔషధాలపై ప్రయోగాలు జరుగుతుండగా రెగ్ ఇన్ మ్యూన్ అనే ఔషధం కరోనా కట్టడిలో అద్భుతంగా పని చేస్తున్నట్టు తేలింది. ఇమ్యునో ఫ్రీ అనే మరో ఔషధం సైతం కరోనా కట్టడిలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తోందని సమాచారం అందుతోంది.
అయితే పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అనంతరం ఈ ఔషధాలను మార్కెట్లోకి తీసుకొనిరావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఔషధాలు తీసుకున్న రోగులు వేగంగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. ఈ మందులను వినియోగించిన రోగుల్లో 88 శాతం మందికి ఐదు రోజుల్లోనే కరోనా నెగిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ప్రస్తుతం కరోనాను వీలైనంత త్వరగా కట్టడి చేయడమే శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్.
ఒకవేళ ఆయుర్వేద విధానం ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటే శాస్త్రవేత్తలు సైతం ప్రజలకు వీటిని వినియోగించడానికే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆయుర్వేద మందులతో పాటు కొన్ని మందులు మంచి ఫలితాలను చూపిస్తుండటంతో త్వరలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కరోనాతో మరో సంచలన ప్రమాదం వెలుగులోకి..