https://oktelugu.com/

Corona: అజాగ్రత్తగా ఉంటే మొదటికే మోసం.. కొవిడ్ పై ఎయిమ్స్-ఐసీఎంఆర్ కీలక సూచనలు!

Corona: దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు చేసింది. నిర్లక్ష్యం వహిస్తే మొదటికేమోసం వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎప్పటిలాగానే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ రోజువారీగా 3వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వారం […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 20, 2022 1:33 pm
    Third Wave Begins

    Corona Third Wave

    Follow us on

    Corona: దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు చేసింది. నిర్లక్ష్యం వహిస్తే మొదటికేమోసం వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎప్పటిలాగానే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ రోజువారీగా 3వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లోనే ఈ సంఖ్య 24వేలు దాటగా.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

    Corona

    Corona

    ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్- ఏయిమ్స్ ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేశారు. కొవిడ్ సంక్రమించిన వారు లేదా తేలికపాటి లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో మార్గదర్శకాలను విడుదల చేశాయి. దీని ప్రకారం.. కొవిడ్‌ను మూడు రకాలుగా విభజించారు. ఒకటి తేలికపాటి, రెండు మధ్యస్థ, మూడు తీవ్ర స్థాయిగా గుర్తించారు. తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నవారు జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటివి ఐదు రోజులుగా అలాగే ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందాలన్నారు. ఇంట్లో కూడా భౌతిక దూరం పాటించడం, మాస్కు, శానిటైజర్ వాడకం, నీరు ఎక్కవగా తాగడం, రోజుకు మూడు సార్లు బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ 93 శాతం కంటే తగ్గినప్పుడు, ఐదు రోజుల తర్వాత లక్షణాలు తగ్గకపోయినా వెంటనే ఆస్పత్రిలో జాయిన్ అవ్వాలి.

    Also Read:  వారానికో నేత‌ను చేర్చుకుంటారంట‌.. వారిపైనే చంద్ర‌బాబు ఆశ‌లు..

    మధ్యస్థ వ్యాధి లక్షణాలు కలిగిన వారు 24 సార్ల కంటే అధికంగా శ్వాస తీసుకోవడం, రక్తంలో ఆక్సిజన్ 90-93 మధ్యలో ఉంటుంది. అలాంటి వారు వీలైనంత ఎక్కువగా శ్వాసతీసుకోవాలి. 90-96 మధ్య ఆక్సిజన్ ఉండేలా చూసుకోవాలి. కృత్రిమంగా ప్రాణవాయువును పొందాలి. స్టెరాయిడ్ చికిత్స అందించడం వలన ప్రాణవాయువు బాగా అందుతుంది. 2-3 రోజుల కొకసారి సీఆర్పీ, డీ డైమర్ , షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరును చెక్ చేయించుకోవాలి.

    Third Wave Begins

    తీవ్రవ్యాధితో బాధపడేవారు నిమిషానికి 30 సార్లు శ్వాస తీసుకుంటుంటారు. ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ 90 కంటే తక్కువగా ఉండటం జరుగుతుంది. వీరిని వెంటనే ఐసీయూలో చేర్పించి ప్రాణవాయువు అందించాలి. స్టెరాయిడ్ ద్వారా ఆక్సిజన్ అందేలా చూడాలి. వీరికి కూడా 2-3 రోజుల కొకసారి బాడీలోని పార్ట్స్ పనితీరు ఎలా ఉందో టెస్టుల ద్వారా తెలుసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా కొవిడ్ పట్ల నిర్లక్ష్యం చేయరాదు. మధ్యస్థ లక్షణాలు ఉండి, పరికరాల ద్వారా ప్రాణవాయువు పొందుతున్న వారికి 10రోజుల లోపు రెమ్‌డిసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలి.

    Also Read:  హిందీ తెర పై ‘రంగ‌స్థ‌లం’.. సుకుమారే డైరెక్టర్ ?

    Tags