
కరోనా బాధితుల కోసం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఔషధం ధర సాచెట్ కు రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు తెలిపింది. డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా తెలియలేదు.
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో ఆధ్వర్యంలో అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ ఔషధం పని చేస్తున్నట్లు గుర్తించారు. దీన్ని పౌడర్ రూపంలో ఉన్న ఔషధాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. 17న తొలి విడతగా 10 వేల సాచె ట్లను, మే27న రెండో విడతగా మరో 10 వేల సాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది.
కరోనా కట్టడి కోసం డీఆర్డీవో ఏడాది క్రితం ఈ ఔషధం కనుగొంది. గతంలో దీన్ని క్యాన్సర్ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్ కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు.
శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదని తె లుస్తోంది. ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ఔషధానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీని తయారీకి మరో మూడు నాలుగు సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది