Internal Conflicts In YCP: ఏ ముహూర్తాన సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారో కానీ.. అప్పటి నుంచి అధికార వైసీపీలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య అగాధం ఏర్పడింది. మంత్రి పదవులు పోగొట్టుకున్న వారు, అవకాశం దక్కని ఎమ్మెల్యేలు, ఆశావహులు ఆగ్రహంతో ఉన్నారు. కొనసాగింపు లభించిన పాత మంత్రులు, కొత్తగా అవకాశం దక్కించుకున్న వారిపై గుర్రుగా ఉన్నారు. బహిరంగగానే తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన క్రిష్టదాస్ అమాత్య పదవి పోగొట్టుకున్నారు. ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారాం అమాత్య పదవిని ఆశించి భంగపడ్డారు. దీంతో అటు తమ్మినేని, ఇటు ధర్మాన క్రిష్టదాస్ అసంత్రుప్తితో రగిలిపోతున్నారు.
పైకి సీఎం జగన్ ప్రకటనను స్వాగతిస్తూనే లోలోన మాత్రం తెగ బాధపడుతున్నారు. సీఎం జగన్ వైఖరిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల మంత్రిగా స్వస్థలంలో అడుగు పెట్టిన ధర్మాన ప్రసాదరావు అభినందన సభకు సైతం గైర్హాజరయ్యారు. మంత్రివర్గంలో కొనసాగింపు లభించిన సీదిరి అప్పలరాజుపై సైతం గుర్రుగా ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్నలరాజుకు అందలమెక్కించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాకు దూరంగా ఉంటున్నారు.
Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి ఇమేజ్ కు డ్యామేజీ.. బండ్ల గణేష్ తో ట్విట్టర్ యుద్ధమే కారణం
పార్వతీపురం మన్యం జిల్లాలో తాజా మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి కూడా తెగ బాధపడుతున్నారట. బలమైన రాజకీయ నేపథ్యం ఉండి.. కుటుంబ సభ్యులతో విభేదించిన జగన్ తో నడిస్తే ఇదా బహుమతి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బొత్స సత్యనారాయణను కొనసాగించి తనను తీసి వేయడంపై ఆమె బాధగా ఉన్నారు. తన స్థానంలో ఎంపికైన పీడిక రాజన్నదొర జిల్లాకు చేరుకునే సమయంలో కూడా ఆమె అందుబాటులో లేరు. కుటుంబంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. విశాఖ జిల్లాలో అయితే మంత్రి పదవి పోగొట్టుకున్న అవంతి శ్రీనివాసరావు వ్యధ అంతా ఇంతా కాదు. కనీసం విశాఖ జిల్లాకు కనీస ప్రాతినిధ్యం లేకుండా చేశారని.. కేవలం విజయసాయిరెడ్డిని ద్రుష్టిలో పెట్టుకొనే తనకు ఎసరు పెట్టారని తెగ బాధపడుతున్నారు. మరోవైపు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. తన జిల్లాలోని గుడివాడ అమర్ నాథ్, బూడి ముత్యాలనాయుడుకు అవకాశమిచ్చి.. తనను మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్న బాధతో ఆయన నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. జిల్లాలో అడుగెట్టిన కొత్త మంత్రులకు కనీసం ఆహ్వానం పలకలేదు. శుభాకాంక్షలు సైతం చెప్పలేదు.
నెల్లూరులో పోటీ సభ
నెల్లూరు వైసీపీలో కూడా మంత్రివర్గ విస్తరణ కొత్త వివాదాలకు దారితీస్తోంది. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా ఆదివారం జిల్లాకు వస్తున్నారు.దీంతో ఆయన అనుచరులు, అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. నెల్లూరును ముస్తాబు చేశారు. అయితే కాకానికి ఇతర ఎమ్మెల్యేలు, నేతలతో పొసగదు. గతం నుంచి కూడా తత్సంబంధాలు లేవు. దీంతో సహజంగా ఆయన వ్యతిరేక వర్గాన్ని మూటగట్టుకున్నారు. ఆయన వ్యతిరేకుల్లో అనిల్ కుమార్ యాదవ్ ముందుంటారు. తన మంత్రి పదవిని కొట్టేశారన్న బాధ ఉంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాని పెట్టిన ఇబ్బందులను కూడా అనిల్ కుమార్ యాదవ్ మరిచిపోలేదు. అందుకే కాకానికి రివర్ష్ సాయం అందిస్తానని చెప్పుకొచ్చారు. సరిగ్గా కాకాని జిల్లాకు వస్తున్న సమయంలోనే ఆయనకు పోటీ సభ పెట్టాలని నిర్ణయించారు. దానికి భారీగా జన సమీకరణ చేశారు. తాము ఎవరికీ పోటీ సభ పెట్టడం లేదని.. మూడు రోజుల ముందే అనుమతి తీసుకున్నట్టు చెబుతున్నా.. కాకాని గోవర్థన్ రెడ్డికి గట్టి సాంకేతిమివ్వాలన్న యత్నంలో భాగంగానే పోటీ సభ పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ బాగనే కాక రేపుతోంది.
Also Read:Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్టోరీ ఇదేనా.. బయపడిపోతున్న మహేష్ ఫాన్స్
Web Title: Conflicts in the ycp in all districts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com