విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జోడీ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో లిప్ లాక్ లతో వీరు రెచ్చిపోయిన తీరు అందరికీ గుర్తే. అయితే.. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్లోనూ వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే రూమర్స్ వచ్చాయి.
Also Read: బంద్.. నితిన్-రానా కొంప ముంచుతాయా?
గతంలో రక్షిత్ శెట్టితో రిష్మిక ఎంగేజ్ మెంట్ రద్దైపోవడానికి కూడా వీరి చట్టాపట్టాలే కారణమన్న గాసిప్స్ జోరుగా ప్రచారం అయ్యాయి. విజయ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా రష్మిక హాజరైంది. దీంతో.. మళ్లీ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం సద్దుమణిగాయి.
ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలుసుకోవడంతో.. అది కూడా ముంబైలో కావడంతో.. ‘ఏంటి సంగతి’ అని ఆరాతీస్తున్నారు జనాలు. వీళ్లిద్దరూ ఒకే కారులోంచి దిగి, ఓ ఇంట్లోకి వెళ్తుండగా కెమెరాలకు చిక్కారు. దీంతో.. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లివస్తున్నారు? ఇక్కడ కలుసుకోవడానికి కారణాలేంటీ? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
Also Read: రూ.75 లక్షల బహుమతి అందుకున్న ‘ఉప్పెన’ డైరెక్టర్
ప్రస్తుతం లైగర్ సినిమా కోసం విజయ్ ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అటు రష్మిక మందన్నా కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మిషన్ మజ్జు సినిమాలో నటిస్తోందీ శాండల్ బ్యూటీ. ఈ సినిమా కోసమే రష్మిక కూడా ముంబై వెళ్లిందట. చేతిలో పుష్పగుచ్చాలు కూడా ఉండడంతో.. ఎవరినో కలిసి వస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. వీళ్లిద్దరూ గత చిత్రాల నుంచీ ఫ్రెండ్స్ కాబట్టి.. ఇప్పుడు ఇద్దరూ ముంబైలోనే ఉన్నారు కాబట్టి.. అలా కాలం కలిసి వచ్చింది కాబట్టి కలిశారే తప్ప, ఇందులో చెవులు కొరుక్కోవడానికి ఏమీ లేదంటున్నారు వారి సన్నిహితులు. మరి, ఇందులో నిజం ఎంత అన్నది వాళ్లకే తెలియాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్