దర్శకుడు వంశీ పైడిపల్లిది ఎంతైనా పెద్ద మనసు. తనకు అన్యాయం చేసిన వ్యక్తి సినిమాకి వచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇంతకీ దేని గురించి అంటే.. కింగ్ నాగార్జునను హీరోగా పెట్టి ‘వైల్డ్‌డాగ్’ అనే యాక్షన్ సినిమాని డైరెక్ట్ చేసిన కొత్త డైరెక్టర్ అషిషోర్ సాల్మన్. ఇతగాడు డైరెక్టర్ అవ్వకముందు రచయితగా కొన్ని సినిమాలు చేశాడు. ఈ క్రమంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి దగ్గర రైటింగ్ టీమ్ లో పని చేశాడు. ఆ సమయంలో వంశీ ఈ డైరెక్టర్ కి వైల్డ్ డాగ్ లైన్ చెప్పి కథగా రాయమన్నాడట. దాంతో మొత్తానికి కిందామీదా పడి సాల్మన్ కథ రాశాడు.
కానీ ఆ కథను వంశీకి ఇవ్వకుండా కథ బాగుంది కాబట్టి నేనే డైరెక్షన్ చేస్తాను అంటూ వంశీకి షాక్ ఇచ్చాడు. అయినా, వంశీ ఇదేమి మనసులో పెట్టుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సాల్మన్ గురించి మంచిగా మాట్లాడి.. అతని గౌరవాన్ని కాపాడి, చివరకు తనది గొప్ప మనసు అని నిరూపించుకున్నాడు. ఇంతకీ వంశీ ఏం మాట్లాడాడు అంటే.. వంశీ మాటల్లో.. ‘అందరికీ థ్యాంక్స్. నా మహర్షికి సోలోమన్ కో రైటర్. తన కోసం అయినా ఈ వైల్డ్ డాగ్ అదిరిపోవాలి. సోలోమన్‌ను ఊపిరి కథకి కూడా పని చేశారు. ఆయన నా టీమ్ లోకి రావడంతోనే నా ఆలోచన మారిపోయింది. ఆయనేంటో నాకు తెలుసు. ఏప్రిల్ 2న తరువాత ప్రపంచానికి తెలుస్తుంది’ అంటూ తనని మోసం చేసినవాడి గురించి కూడా వంశీ నాలుగు మంచి మాటలు చెప్పాడు.
ఇక పనిలో పనిగా వంశీ నాగార్జున గురించి కూడా మాటాడుతూ ‘ఊపిరి సినిమాతో నా జీవితం మారిపోయింది. ఆ అవకాశం ఇచ్చినందుకు నాగ్ సర్ కు థ్యాంక్స్. నేను అప్పుడు 120 కేజీలు.. కానీ ఇప్పుడు ఇలా సన్నబడ్డాను. కారణం నాగార్జునగారే. ఆయన ఎప్పుడూ కూడా హద్దులు చెరిపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా అలాంటి చిత్రమే అంటూ వంశీ ముగించాడు. ఇక ఈ సినిమాలో నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా నటించింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా తెరకెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vamshi paidipally speech at wild dog base camp event
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com