
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎవరైనా నచ్చితే వారికి తన స్నేహ హస్తాన్ని అందిస్తూ వారిని ప్రత్యేకంగా ఆదరిస్తాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ స్నేహ బంధం ఎంతో ఘాఢమైనది. సినిమాల పరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి మిత్రులు ఆప్తులు. అందుకే పవన్ కళ్యాణ్ చేసే సినిమాల వెనుక త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుందని ఇప్పటికే చాలసార్లు పవనే చెప్పాడు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే.. అందరి కంటే ముందు వచ్చే వ్యక్తి త్రివిక్రమ్.
పైగా తానే సెట్ చేసిన సినిమా ఈవెంట్ ఫంక్షన్ లో త్రివిక్రమే లేకపోవడం ఏమిటి అని పవన్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ‘వకీల్ సాబ్’ పట్టాలెక్కడానికి కారణమైన త్రివిక్రమ్, ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ కి మాత్రం త్రివిక్రమ్ రాలేదు. అందుకు బలమైన కారణం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అందుకే త్రివిక్రమ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారట. అందోళన వ్యక్తం చేస్తోన్న పవన్ ఫ్యాన్స్ త్వరగా త్రివిక్రమ్ కరోనా నుండి పూర్తిగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక త్రివిక్రమ్ తరువాత సినిమాని ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. నిజానికి తారక్ సినిమాల్లోనే ఇలాంటి వైవిధ్యమైన టైటిల్ ఇంతవరకూ రాలేదు. ఇక రాజకీయాల పై నడిచే ఓ కొత్త కథతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది అని, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అన్నట్టు ‘అరవింద సమేత’ భారీ హిట్ అవ్వడంతో.. ఆ విజయోత్సాహంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఘనంగా ఈ సినిమాని ప్రకటించడం కూడా ఈ సినిమా పై మరింత హైప్ ను క్రియేట్ చేసింది.