
నేటి తెలుగు సినిమాల దర్శకుల లిస్ట్ లో క్రేజ్ ఉన్న నలుగురు ఐదుగురులో త్రివిక్రమ్ ఒకరు. త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం.. మహేష్ , ఎన్టీఆర్ లాంటి హీరోలు సైతం వెంటపడి మరీ సినిమాలు చేసేంత డిమాండ్. పైగా త్రివిక్రమ్ కెరీర్ లో ప్లాప్ అయిన సినిమాలకు కూడా ఒక గౌరవం ఉంది. ముఖ్యంగా రెవిన్యూ పరంగా డిజాస్టర్ అయిన ఒక్క సినిమా కూడా త్రివిక్రమ్ ఖాతాలో లేకపోవడం నిజంగా విశేషమే. అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీగా ఉంటే, బన్నీ , మహేష్ తమ తరవాత సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్లాన్ చేసుకోవడానికి తెగ ఉత్సాహ పడుతున్నారు.
Also Read: బంద్.. నితిన్-రానా కొంప ముంచుతాయా?
అసలు వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సంజయ్ లీలా భన్సాలీ లాంటి డైరెక్టర్ ఆసక్తి చూపించినా.. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ కి డేట్స్ కేటాయించాడు. అందుకే, త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు. కాగా ఈ సినిమాలో చిన్నచిన్న పాత్రలలో కూడా నటీనటులను పెద్దవాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాడని.. ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి అత్త క్యారెక్టర్ ఉందని.. దానికోసం సీనియర్ హీరోయిన్ టబును తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
Also Read: రూ.75 లక్షల బహుమతి అందుకున్న ‘ఉప్పెన’ డైరెక్టర్
ఇక ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా విలన్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి సునీల్ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా ? పైగా ఎన్టీఆర్ సినిమాలో విలన్ అంటే.. భారీ అంచనాలు ఉంటాయి. మరి సునీల్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెడతాడని, నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా బఫూన్ అవుతున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.