Homeఎంటర్టైన్మెంట్Tollywood Comedy Actors: ఆలీ, బ్రహ్మానందం, సునీల్ వల్లే కాలేదు.. నీకెందుకు సప్తగిరి?

Tollywood Comedy Actors: ఆలీ, బ్రహ్మానందం, సునీల్ వల్లే కాలేదు.. నీకెందుకు సప్తగిరి?

Tollywood Comedy Actors: కమెడియన్స్ హీరోలుగా మారడం ఇప్పటి ట్రెండ్ కాదు. పద్మనాభం నుండి బ్రహ్మానందం వరకు చాలా మంది ఫార్మ్ లో ఉన్నప్పుడు హీరోలుగా సినిమాలు చేశారు. ఆలీ లాంటి కమెడియన్ భారీ సక్సెస్ లు కూడా చూశారు. ఆలీ హీరోగా చాలా చిత్రాలు చేశారు. వాటిలో యమలీల, ఘటోత్కచుడు, అక్కుం బక్కుం మంచి విజయాలు అందుకున్నాయి. అయితే కమెడియన్ నుండి హీరోగా స్థిరపడినవారు ఎవరూ లేరు. ఏదో ఒక దశ వరకు మాత్రమే వాళ్ళ హవా సాగింది. కింగ్ ఆఫ్ కామెడీ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం కూడా పూర్తి స్థాయి హీరోగా సక్సెస్ కాలేదు.

Tollywood Comedy Actors
Tollywood Comedy Actors Ali and Brahmanandam

ఆలీ, సునీల్ ఒకింత పర్వాలేదు అనిపించుకున్నారు. సునీల్ ప్రారంభంలో హీరోగా మంచి సక్సెస్ చిత్రాలు చేశారు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత వరుస పరాజయాలతో సునీల్ కెరీర్ ప్రమాదంలో పడింది. చివరికి తప్పు తెలుసుకొని వర్సటైల్ యాక్టర్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Tollywood Comedy Actors
Tollywood Comedy Actors Sunil and Brahmanandam

హీరోగా ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మరొక టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో స్టార్ కమెడియన్స్ లిస్ట్ లో చేరిన సప్తగిరి.. చాలా వేగంగా ఎదిగారు. వివిధ కారణాలతో స్టార్ కమెడియన్స్ టాలీవుడ్ కి దూరం కావడంతో ఆ స్థానం భర్తీ చేశాడు. 2015-16లలో ఏడాదికి 20 సినిమాలు చేసేంత బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. దీంతో హీరోగా అవకాశాలు వచ్చాయి.

Tollywood Comedy Actors
Tollywood Comedy Actor Sapthagiri

Also Read: చైతూ-ధనుష్ విడాకులు..దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన తప్పేంటి?
సప్తగిరి హీరో అయ్యాక ఆయనకు ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. సప్తిగిరి ఎల్ఎల్బి తర్వాత ఏడాదికి 15కి పైగా చిత్రాలు చేసే సప్తగిరి కేవలం నాలుగైదు సినిమాలకు పరిమితమయ్యాడు. అలాగే కమెడియన్ గా ఎక్కువ నిడివి ఉన్న పాత్రలు కూడా రావడం లేదు. సప్తగిరి హీరోగా మారి నష్టపోయాడనే చెప్పాలి. నిజానికి స్టార్ కమెడియన్ గా స్టార్ హీరో సంపాదన సాధ్యమే. రోజుకు రెండు లక్షలకు పైగా తీసుకునే కమెడియన్స్ భారీగానే ఆర్జించవచ్చు.

కానీ హీరో కావాలనే ఆశతో అనవసరంగా ఉన్న కెరీర్ పోగొట్టుకుంటున్నారు. నటుడు సునీల్ హీరో కావాలని చాలా కోల్పోయాడు. కమెడియన్ గా సునీల్ ఏడాదికి ముప్పైకి పైగా సినిమాలు చేసేవాడు. అలాంటిది హీరోగా మారి కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టుకున్నాడు. సునీల్ చేసిన తప్పునే సప్తగిరి చేస్తున్నాడు. హీరోగా ఎదగాలనే తపనతో తనకున్న గుర్తింపు, అవకాశాలు కోల్పోతున్నాడు. హీరోగా మరో కొత్త సినిమా ప్రకటించిన సప్తగిరికి సునీల్ లాంటి సీనియర్స్ ని చూసి కూడా జ్ఞానబోధ కావడం లేదు

Also Read: సాయి పల్లవిని స్టార్ హీరోయిన్ కానివ్వరా… చెల్లి చెల్లి అంటూ ఈ గోలేంటి?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Nagarjuna: బంగార్రాజు మూవీ సక్సెస్ మీట్‌‌ తూ.గో జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. కాగా ఈ సక్సెస్ మీట్ లో హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇటీవల సీఎం జగన్‌తో భేటీ గురించి చిరంజీవితో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుందని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే. త్వరలోనే టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం వస్తుంది’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. గత వారం ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జగన్ తో మెగాస్టార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. […]

Comments are closed.

Exit mobile version