Natural Star Nani: అంటే సుందరానికి సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న చిత్రం దసరా.. నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇది. సుమారు 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని SLV సంస్థ నిర్మిస్తుంది. శ్రీకాంత్ ఓదెల అంటే నూతన దర్శకుడు తెరకెక్క్కిస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చాలా వరుకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఈ చిత్రం కథ బొగ్గు గనుల నేపథ్యం లో సాగుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరిఖని లో జరుగుతుండగా నాని కి ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది.. ఒక బొగ్గు ట్రక్ క్రింద నాని ఉన్నప్పుడు ఒక్కసారిగా బొగ్గు మొత్తం నాని మీద పడిపోయిందట.. చాలా సేపు ఆయన ఆ బొగ్గు లోనే ఇరుక్కుపోయారు. కానీ అదృష్టం కొద్దీ తక్కువ గాయాలతోనే ఆయన బయటపడ్డాడు.. నాని ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారని. ఆయనకి ఎలాంటి తీవ్రమైన గాయాలు అవ్వలేదని.. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ దసరా మూవీ టీం ఈ సందర్భంగా తెలిపింది.

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో వచ్చిన నాని అంటే సుందరానికి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది.. ఒక్క ఓవర్సీస్ లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో నష్టాలనే మిగిలించింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనేది చాలా మందికి ఇప్పటికి అర్థం కానీ ప్రశ్న.. కామెడీ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ ఈ సినిమా ఎంతో అద్భుతం అని చెప్పాలి.. కానీ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.. అంతే కాకుండా పాటలు కూడా పెద్దగా బాగుండవు.. దానికి తోడు ఈ సినిమాకి పోటీ గా విక్రమ్, మేజర్ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. వాటి ప్రభావం కూడా ఈ సినిమా పై పడి వసూళ్లు వచ్చి ఉండకపోవచ్చు అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.. దీనితో నాని దసరా సినిమాతో ఇండస్ట్రీ లో మారుమోగిపోయ్యే హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు.. ఈసారి గురి తప్పకూడదు అనే ఈ సినిమాకోసం ఎంతో కష్టపడుతున్నాడు.. మరి నాని దసరా సినిమాతో అభిమానులను ఆకట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.
[…] Also Read: Hero Nani: హీరో నానికి తృటిలో తప్పిన ఘోర ప్ర… […]