Homeఎంటర్టైన్మెంట్Shyam Singha Roy Movie Villain: శ్యాం సింగరాయ్ మూవీ విలన్.. ఇతన్ని తప్ప వేరే...

Shyam Singha Roy Movie Villain: శ్యాం సింగరాయ్ మూవీ విలన్.. ఇతన్ని తప్ప వేరే వారిని ఊహించుకోలేము

Shyam Singha Roy Movie Villain: శ్యాం సింగరాయ్ మూవీ పునర్మజ్జ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విషయం తెలిసింది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా అతనికి జోడిగా సాయిపల్లవి, కృతిశెట్టి నటించారు. శ్యాం సింగరాయ్ మూవీలో నాని డ్యూయల్ రోల్ పోషించాడు. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు.

Shyam Singha Roy Movie Villain
Shyam Singha Roy Movie Villain manish wadhwa

క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్‌ను బాగా మెప్పిస్తోంది. కొన్ని సెంటర్లలో దీనికి డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో మనీష్ వాధ్వా అనే వ్యక్తి విలన్ రోల్ చేయగా, మహంత్ అనే పాత్రలో ఒదిగిపోయాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

ఈ సినిమాలో మనీశ్ వాద్వా కనిపించేది కొద్దిసేపే అయినా అతని పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన రోల్ గంభీరంగా కనిపిస్తుంది. 1972లో ముంబైలో జన్మించిన మనీశ్ ఓ డబ్బింగ్ ఆర్టిస్గుగా కెరీర్ మొదలెట్టాడు. ఆ తర్వాత బుల్లితెర నటుడిగా మారాడు. గతంలో చాణక్యుడి పాత్రలో చేసిన ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాత్రకు ఆయన్ను తప్పా వేరే వ్యక్తిని ఊహించుకోలేమంటే అతని నటనా శైలి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీకృష్ణ వంటి బుల్లితెర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో మణికర్ణిక, పద్మావతి చిత్రాల్లో నటించాడు. తెలుగులో నటించాలనేది మనీశ్ కోరికగా ఇటీవలే ఆయన ప్రకటించాడు. లక్కీగా శ్యాంసింగరాయ్ చిత్రంలో ఆయనకు అవకాశం వచ్చింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడటంతో తెలుగులో మరో సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పాడు మనీశ్ వాద్వా.. ఈ విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు. శ్యాం సింగరాయ్ సినిమాలో నటించడం వలన తనకు ఆఫర్లు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు యాక్టర్ మనీశ్..

Also Read: నేచురల్ స్టార్ నాని కాలికి తీవ్ర గాయం… ఇప్పుడు ఎలా ఉన్నారంటే ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular