Samantha : ‘‘మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. ఈ కష్ట సమయంలో మాకు మద్దతివ్వండి’’ అంటూ నాగచైతన్య, సమంత ఓపెన్ గా అభ్యర్థించారు. అయినా కానీ.. వారిపై చర్చ ఆగడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు పెట్టిన తర్వాత నాగచైతన్య సైలెంట్ గా ఉన్నాడు. కానీ.. సమంత నర్మగర్భంగా పోస్టులు పెడుతోంది. అటు సిద్ధార్థ్ కూడా ఓ పోస్టు పెట్టాడు. ఇటు సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. ఈ విధంగా.. సమంత-చైతూ విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. అయితే.. జుకల్కర్ పరోక్షంగా పెడుతున్న పోస్టుల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సమంత-చైతూ విడాకులు తీసుకోక ముందు మీడియా శోధన చేసింది. ఎప్పుడైతే అక్కినేని అనే పేరును సమంత తొలగించిందో అప్పటి నుంచీ చర్చ ముదిరింది. విడాకులు తీసుకుంటున్నామని కన్ఫామ్ చేశాక.. తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది? విడాకులకు కారణమేంటీ? సమంతకు భరణం ఎంత ఇస్తున్నారు? వంటి డిస్కషన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జుకల్కర్ పెడుతున్న పోస్టులు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
ఆయన పెడుతున్న పోస్టులన్నీ పరోక్షంగా సమంతను సపోర్టు చేస్తున్నట్టుగానే ఉన్నాయి. తప్పు ఆమెది లేదని, చైతూ ఫ్యామిలీ నుంచే ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నది అనే అనుమానం కలిగేలా ఆ పోస్టులు ఉంటున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత బాధితురాలిగా ఉందనే అర్థం వచ్చేలా జుకల్కర్ పోస్టులు ఉంటున్నాయని అంటున్నారు.
తాజాగా.. ‘‘తమ ఇళ్లలోని మగవాళ్ల నిజ స్వరూపం కనిపించకుండా దాచేవాళ్లే.. మహిళలపై జరిగే హింసకు బాధ్యులు. అందులోనూ.. పలుకుబడి ఉన్న కుటుంబాలు దీనికి మరింత కారణం అవుతాయి. ఈ రోజుల్లో హింస అనేది మానసిక వేదింపులు, విమర్శల రూపంలో కూడా ఉంటోంది.’’ అంటూ జుకల్కర్ చేసిన పోస్టు చర్చకు దారితీసింది.
పరోక్షంగా చైతూ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఈ పోస్టు పెట్టాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫైనల్ గా సమంత ఇబ్బందులు ఎదుర్కొందని, దీనికి అక్కినేని కుటుంబంలోని వాళ్లు కూడా బాధ్యత వహించాలంటూ జుకల్కర్ తన పోస్టుల ద్వారా చెప్పదలుచుకున్నట్టుగా ఉందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.