Radhe Shyam 2nd Day Collection: బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ‘రాధేశ్యామ్’. ప్యాన్ ఇండియా లెవల్ లో తీసిన ఈ చిత్రం ఒక డిఫెరెంట్ హాలీవుడ్ స్టైల్ మూవీ అని కామెంట్స్ వచ్చి పడ్డాయి. తెలుగు ప్రేక్షకులకు అంతా ఎక్కలేదని.. హిందీ, ఓవర్సీస్ జనాలను బాగానే మెప్పించిందని టాక్ వినిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ లేదని.. క్లైమాక్స్ ఎపిసోడ్ హైలెట్ అని అంటున్నారు. కొన్ని సీన్లు పిక్చరైజేషన్ బాగా వచ్చిందని.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు.
ఇక రాధేశ్యామ్ తొలి రోజు కలెక్షన్లు చూస్తే మొదటి రోజు రూ.48 కోట్లు ఇండియా వైడ్ నెట్ సంపాదించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండోరోజు ఆ కలెక్షన్లు బాగా తగ్గాయి. రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ.24 కోట్లు కలెక్షన్లు సాధించిందని.. అన్ని భాషల్లో కలిపి సాధించిన ఈ మొత్తం చాలా తక్కువ అని చెబుతున్నారు.
రెండు రోజుల్లో కలిపి రాధేశ్యామ్ కలెక్షన్లు రూ.72 కోట్లు దాటాయి. ఇది ప్యాన్ ఇండియా చిత్రానికి చాలా తక్కువ అని చెబుతున్నారు. భీమ్లానాయక్ కలెక్షన్లను రాధేశ్యామ్ క్రాస్ చేయకపోవచ్చని అంటున్నారు.చూడాలి మరీ లాంగ్ రన్ రాధేశ్యామ్ ఈ మేరకు పర్ ఫామెన్స్ చూపిస్తుంది? ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందన్నది.. వీకెండ్ ఉండడంతో ప్రస్తుతానికి ఈ మూడు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Radhe Shyam Movie Highlights: ‘రాధేశ్యామ్’ మూవీలో అద్భుత హైలెట్స్.. ప్రధాన లోపాలేంటో తెలుసా?
[…] […]
[…] Puneeth Rajkumar James Movie: వచ్చే వారం కన్నడ నాట సినిమా జాతర జరగబోతుంది. సూపర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పునీత్ చివరి చిత్రాన్ని ప్రత్యేకంగా తీసుకుంది కన్నడ ఇండస్ట్రీ. ఆ రోజున ప్రతి కన్నడ స్టార్ హీరో పునీత్ సినిమా చూస్తాడట. దీని గురించి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. […]
[…] Hair On Tongue: ఇదేం కాలమో ఏమో గానీ రోజుకో కొత్త రోగం తెరమీదకు వస్తోంది. ఇప్పుడు కేరళలో ఓ వ్యక్తికి వచ్చిన జబ్బు గురించి తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీకు నాలుక మీద ఉండే మచ్చల గురించి తెలిసే ఉంటుంది. అయితే నాలుక మొత్తం బ్లాక్ గా మారిపోయి, వెంట్రుకలు పెరగడం గురించి మీరెప్పుడైనా విన్నారా.. ఏంటీ అదేం రోగం అని షాక్ అవుతున్నారా అయితే మీకు ఈ విషయం గురించి పూర్తిగా చెబుతాం వినండి. […]