https://oktelugu.com/

వ్యభిచారిణిలే టార్గెట్ .. రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కథ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పోర్న్ వీడియోలు చిత్రీకరించిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కుంద్రాపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్ కుంద్రాపై పలు కథనాలు వెలువడుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కుంద్రా పలువురిని ట్రాప్ చేసి వాటిని రూపొందించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయిన ఈనెల 27 వరకు అతడి పోలీస్ కస్టడీ పొడిగించడంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 25, 2021 / 04:46 PM IST
    Follow us on

    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పోర్న్ వీడియోలు చిత్రీకరించిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కుంద్రాపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్ కుంద్రాపై పలు కథనాలు వెలువడుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కుంద్రా పలువురిని ట్రాప్ చేసి వాటిని రూపొందించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయిన ఈనెల 27 వరకు అతడి పోలీస్ కస్టడీ పొడిగించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

    ఇక అశ్లీల చిత్రాల నిర్మాణంలో ఎంత పెద్ద వారు ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదని పోలీసులు చెబుతున్నారు. రాజ్ కుంద్రాకు చెందిన ఒక ప్రధాన వ్యక్తి వల్లే ఈ తతంగం బయటకు వచ్చిందని సమాచారం. ఫిబ్రవరిలోనే కేసు నమోదు కాగా రాజ్ కుంద్రా లంచాలు ఎర చూపుతూ ఇన్నాళ్లు సాగదీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలుచేస్తున్నా బయటకు వస్తే కేసును పక్కదారి పట్టించే అవకాశాలుండడంతో బెయిల్ మంజూరు కావడం లేదు. విచారణ కోసం కస్టడీలో ఉంచాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

    పోర్న్ మాఫియాను తుదముట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహాలో రెచ్చిపోతున్నారు. గత రెండు మూడేళ్లలో అశ్లీల చిత్రాల ప్రాబల్యం పెరిగిపోతోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేసుకుని వారిని ఈ రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దందాను విస్తరిస్తూ డబ్బు సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. ముంబయిలో మోడల్స్ ను ఈ వీడియోలకు పావులుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

    హీరోయిన్ పూనమ్ పాండేను కూడా ఇందులో దింపేందుకు రాజ్ కుంద్రా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆమె తిరగబడి ఆయనపై కేసు పెట్టింది. ఈ కేసులో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల రాజ్ కుంద్రా ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇందులో అశ్లీల వీడియోల డేటా దొరికినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భవిష్యత్తులో ఇంకా ఎన్ని దారుణాలు వెలుగు చూస్తాయో వేచి చూడాల్సిందే.