కరోనా తర్వాత: థియేటర్లా? ఓటీటీలా? ఏది లాభం?

కరోనా లాక్ డౌన్ లో అటు నిర్మాతలకు, ఇటు ప్రేక్ష‌కుల‌కు ఎడారిలో ఒయాసిస్సులా క‌నిపించింది ఓటీటీ. అప్ప‌టికే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నవి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఉన్న‌వి, షూటింగ్ ముగించుకున్న‌వి స్టోర్ రూముల‌కు ప‌రిమితం అయ్యాయి. బ‌డా నిర్మాత‌లైనా.. చిన్న ప్రొడ్యూస‌ర్లైనా.. ఇంట్లోని డ‌బ్బుతోనే సినిమా తీయ‌లేరు. ఫైనాన్స్ తేవ‌డం.. రిలీజ్ అయిన త‌ర్వాత అప్పులు తీర్చేయ‌డం.. అనే రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో సాగుతుంది. అలాంటి నిర్మాత‌లంతా కంటికి స‌రిగా నిద్ర‌కూడా పోలేని ప‌రిస్థితి. తెచ్చిన […]

Written By: Bhaskar, Updated On : April 4, 2021 4:04 pm
Follow us on


కరోనా లాక్ డౌన్ లో అటు నిర్మాతలకు, ఇటు ప్రేక్ష‌కుల‌కు ఎడారిలో ఒయాసిస్సులా క‌నిపించింది ఓటీటీ. అప్ప‌టికే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నవి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఉన్న‌వి, షూటింగ్ ముగించుకున్న‌వి స్టోర్ రూముల‌కు ప‌రిమితం అయ్యాయి. బ‌డా నిర్మాత‌లైనా.. చిన్న ప్రొడ్యూస‌ర్లైనా.. ఇంట్లోని డ‌బ్బుతోనే సినిమా తీయ‌లేరు. ఫైనాన్స్ తేవ‌డం.. రిలీజ్ అయిన త‌ర్వాత అప్పులు తీర్చేయ‌డం.. అనే రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో సాగుతుంది. అలాంటి నిర్మాత‌లంతా కంటికి స‌రిగా నిద్ర‌కూడా పోలేని ప‌రిస్థితి. తెచ్చిన అప్పుల‌కు వ‌డ్డీలు పెరిగిపోవ‌డంతో.. వారి గుండె వేగం కూడా పెరిగిపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు అన్న‌ట్టుగా ఓటీటీలో సినిమాల‌ను వ‌దిలారు.

అయితే.. సినిమా ఎక్క‌డ రిలీజ్ చేసినా.. బాగుంటేనే జ‌నం చూస్తారు క‌దా. అందుకే.. బాగున్న‌వి బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా అయ్యాయి. బాగ‌లేనివి అట్ట‌ర్ ఫ్లాప్ గా కూడా మిగిలాయి. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ నుంచి థియేట‌ర్లు తెరుచుకోవ‌డం.. అప్పుడు కూడా ఒక‌రిని చూసి మ‌రొక‌రు ధైర్యం చేయ‌డం జ‌రిగిపోయింది. రిజ‌ల్ట్ విష‌యంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. బాగున్న‌వి కాసుల వ‌ర్షం కురిపిస్తే.. బాగోలేని‌వి ఈగ‌లు తోలుకున్నాయి.

కానీ.. ఇక్క‌డ చాలా మంది గుర్తింలేని పాయింట్ ఒక‌టుంది. ఓటీటీలో రిలీజ్ చేస్తే.. ఆ సంస్థ‌లు ముందుగానే నిర్మాత‌కు డ‌బ్బుల‌న్నీ చెల్లిస్తాయి. (పే అండ్ వ్యూ త‌ర‌హాలోనూ రిలీజ్ అవుతాయి.. అది వేరే సంగ‌తి) అయితే.. ఓటీటీలో రిలీజ్ చేయ‌డం అంటే ఒక ర‌కంగా సినిమా మొత్తాన్ని అమ్మేసిన‌ట్టు లెక్క‌. డ‌బ్బులు మొత్తం ముందుగానే ముడ‌తాయి కాబ‌ట్టి.. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా నిర్మాత‌కు సంబంధం లేదు. అందుకే.. మొత్తం బ‌డ్జెట్ పై మార్జిన్ చూసుకొని ఓటీటీకి సినిమాల‌ను ఇచ్చేస్తుంటారు. అంటే.. న‌ష్టం లేకుండా బిజినెస్ ముగుస్తుంది.

థియేట‌ర్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌ప్పుడు లెక్క‌లు మొత్తం మారిపోతాయి. బ‌య్య‌ర్లు కొన‌డానికి ముందుకు రావాలి. వ‌చ్చిన వాళ్లు ఎంత‌కు కొంటారు? బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతామా? లేదా? అనేది చాలా త‌తంగం ఉంటుంది. మొద‌టి ఆట‌గ‌న‌క సినిమా బాగోలేద‌ని టాక్ స్ప్రెడ్ అయ్యిందంటే.. అంతే సంగ‌తులు. ఇలాంటి ప‌రిస్థితుల్లో దారుణ న‌ష్టాల‌ను చ‌వి చూడాల్సి వ‌స్తుంది. అయితే.. ఈ ప‌రిస్థితి గ‌తంలోనూ ఉంది క‌దా.. అనొచ్చు. అది ఎప్ప‌టికీ ఉంటుంది. వాట‌న్నింటికీ సిద్ధ‌ప‌డే %A