Nagarjuna: నాగార్జున గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పాలి. ఈ అరవైఏళ్ళ మన్మధుడు వయసు 30 దగ్గరే ఆగిపోయింది. ఆయన గ్లామర్ రహస్యం గురించి చెప్పాలంటే ఆహార నియమాలు, వ్యాయామం, క్రమశిక్షణ. ఆరోగ్యం కోసం నాగార్జున చాలా నిష్టగా ఉంటారు. మరి అలాంటి నాగార్జునను కూడా ఓ వ్యసనం వెంటాడిందట. ఓ దశలో నాగార్జున మద్యానికి బానిస అయ్యారట.

కొన్నాళ్ళు తనని వెంటాడిన ఈ అలవాటు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడారు.ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండే నాగార్జున. ఓ సినిమా కారణంగా తాగుడు కి అలవాటు పడ్డారట. నాగార్జున-నాని కాంబినేషమ్ లో దేవదాసు అనే మల్టీస్టారర్ చేశారు. ఈ మూవీలో నాగార్జున డాన్ రోల్ చేశారు. ఈ పాత్రలో నాగార్జున ఎప్పుడు తాగుతూ కనిపించాల్సి ఉంది.. సినిమాలో ఆ పాత్ర సహజంగా రావాలని నాగ్.. రోజూ సాయంత్రం ఓ 2 పెగ్గులు వేసి సెట్ కు వచ్చేవారట. అలా అనుకోకుండా నాగార్జున మద్యానికి బానిస అయ్యారట.
Also Read: మోర్ మసాలా మోర్ రొమాన్స్… విమర్శలు లెక్క చేయని నాగార్జున!
తనను చాలా కాలం పాటు ఈ అలవాటు వదల్లేదని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఎంతో కష్టపడి తాను అందులోనుంచి బయటపడి మళ్లీ యదా స్థితికి వచ్చినట్లు ఆయన వివరించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మద్యం అలవాటు కారణంగా కెరీర్, ప్రాణాలు పోగొట్టుకున్న నటులు పరిశ్రమలో ఎందరో ఉన్నారు. ఎస్విఆర్, రంగనాధ్, రాజబాబు ఇందుకు ఉదాహరణ.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 ను పూర్తి చేసిన నాగార్జున త్వరలో ఓటిటిలో బిగ్ బాస్ షో హోస్ట్ చేయనున్నారు.ఆయన నటిస్తున్న ఘోస్ట్ చిత్రీకరణ జరుపుకుంటుంది. బంగార్రాజు మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Also Read: ఆర్ ఆర్ ఆర్ వెనక్కి వెళ్లినా.. భీమ్లా నాయక్ ముందుకు రాలేదు ఎందుకు?