
కన్నడ భామ ‘నభా నటేష్’లోని గ్లామర్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి ఉంది. ప్రస్తుతం ఉన్న చాలమంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, ఆమె చాల మంచి నటి. కానీ ఎందుకో నభాకి కొత్తగా సినిమా ఆఫర్లు రావట్లేదు. వస్తోన్న ఆఫర్లు కిక్ ఇవ్వడం లేదు. అంటే.. స్టార్ హీరోల సినిమాలు అయితేనే తనకు మంచి ఉత్సాహం ఉంటుందట. ఏది అయితే ఏం ? నభాకి ఇప్పుడు ఛాన్స్ లు రావట్లేదు, రాపోవడానికి కారణం ఇద్దరు హీరోయిన్స్ ఫామ్ లోకి రావడమేనట. వాళ్లే కృతి శెట్టి, కేతికా శర్మ.
నిజానికి వీళ్ళు చేసే రోల్స్ నభా నటేష్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. కానీ, ఈ కొత్త భామల వైపు ఫిల్మ్ మేకర్స్ ఫోకస్ పెట్టి.. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని నభా ఫీల్ అవుతుంది. అయితే ఆమె మేనేజర్ ఇచ్చిన సలహా మేరకు తరుచుగా ఫోటో షూట్స్ చేసి.. ఎప్పటికప్పుడు లుక్స్ ను స్టిల్స్ ను మారుస్తూ ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తే.. ఉపయోగం ఉంటుందని చెప్పాడట. దాంతో నభా ప్రస్తుతం వరుసగా ఫోటో షూట్ ల మీద పడింది.
పైగా సింపుల్ ఫోటో షూట్స్ అయితే వైరల్ అవ్వవు కాబట్టి.. ఆ ఫోటో షూట్ లో గ్లామర్ డోస్ పెంచింది. కాగా ఈ ఫోటో షూట్ ను ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ చేశాడట. మొత్తానికి తనకు కొంత గ్యాప్ వస్తేనే.. నభా ఇలా ఫుల్ గ్లామరస్ ఫోటోషూట్ ల పై పడింది అంటే.. ఇక అసలు సినిమాలే లేకపోతే..? ఈ డౌట్ తో నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. అయితే నభా ఇలా ఛాన్స్ ల కోసం టెన్షన్ పడటానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది.
ఆమెకు ఇటీవల నాగ చైతన్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ తరువాత ఏమైందో ఏమో.. నభాకి అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. అందుకే… అవకాశాల కోసం ఈ అమ్మడు అలాంటి బోల్డ్ ఫోటో షూట్స్ పై పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్ సరసన ‘మేస్ట్రో’ సినిమాలో నటిస్తోంది.