Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నేచురల్ స్టార్ నాని జోరు మీదున్నాడు. చాలా కాలం తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. మరో కొత్త మూవీ షురూ చేశాడు. ‘దసరా’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ HYDలో జరిగింది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. సింగరేణి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బప్పిలహిరి అనగానే ఒంటినిండా ఆభరణాలు, చేతికి పెద్ద కడియం, వేళ్లకు ఉంగరాలు, సన్‌గ్లాసెస్‌తో ఒక ఆహార్యం కళ్లముందు కదలాడుతుంది. 1952 NOV 27న కోల్‌కతాలో జన్మించిన ఆయన అసలు పేరు అలోకేశ్ లహరి. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళ్, కన్నడలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. డిస్కో డ్యాన్సర్, నమక్ హలాల్ వంటి సినిమాలతోపాటు డర్టీ పిక్చర్‌లో ‘ఉ లాలా.. ఉ లాలా’ సాంగ్‌తో సినీ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రముఖ టాలీవుడ్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) వయసు, అనారోగ్యం రీత్యా ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కాగ, కమలమ్మ అంత్యక్రియలు రేపు, జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ప్రఖ్యాత బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బప్పిలహరి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి నివాళి అర్పించారు. తన ట్విట్టర్లో బప్పి లహరితో దిగిన ఫోటోను చిరంజీవి పోస్టు చేశారు. సింగర్ బప్పి దా మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బప్పి లహరితో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చిరు తెలిపారు. తన చిత్రాలకు ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్‌ను బప్పి అందించినట్లు మెగా స్టార్ చెప్పారు.