Ajay Bhupathi’s OTT Debut :బోల్డ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అంటూ మొత్తానికి ప్లాప్ సినిమా తీసి విలువ పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమాని మొదలుపెట్టడానికి అజయ్ భూపతి రెండేళ్ళు పాటు నానాకష్టాలు పడ్డాడు. అయినా మనోడు ఎక్కడా తగ్గకుండా ముందుకుపోతూ వర్మ శిష్యుడు అనిపించుకున్నాడు. కానీ అజయ్ భూపతి సినిమాని సెట్ చేసుకుని… తీరా సినిమా రిలీజ్ అయి భారీ ప్లాప్ అయ్యింది.

‘మహా సముద్రం’ సినిమా పక్కా యాక్షన్ డ్రామాగా వచ్చి భారీ నష్టాలు మిగిల్చింది. అందుకే అజయ్ భూపతికి మళ్ళీ ఛాన్స్ లేకుండా పోయింది. తాజాగా ఓ వెబ్ ఫిల్మ్ ను చేయడానికి సన్నధం అవుతున్నాడు. అయితే ఈ వెబ్ ఫిల్మ్ కుర్రోళ్ళను టార్గెట్ చేసుకుని చేస్తున్నాడట. కాన్సెప్ట్ బాగా బోల్డ్ గా ఉంది, ఆంటీల మీద కుర్రోళ్ళు ఎందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తారు ?

ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారు ? ఆ తప్పులు కారణంగా చివరకు వాళ్ళు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటారు ? అలాగే తప్పటడుగులు వేసిన ఆంటీల పరిస్థితి ఏమిటి..? వాళ్ళ భర్తలకు వీళ్ళ విషయం తెలిస్తే ఎలాంటి బాధలు ఉంటాయి ? అనే కోణంలో ఈ వెబ్ ఫిల్మ్ సాగుతుందట. అయితే ఈ వెబ్ సినిమాలో మెయిన్ లీడ్ గా సీనియర్ హీరోయిన్ స్నేహ నటించబోతుందని తెలుస్తోంది.

కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్ ఈ వెబ్ ఫిల్మ్ లో మెయిన్ లీడ్ కోసం వెతుకున్నాడట. ఈ క్రమంలోనే అజయ్ ఇప్పటికే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణకి కూడా కథ కూడా వివరించారని.. రమ్యకృష్ణ ఇలాంటి వెబ్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అన్నట్టు అజయ్, మీనాని కూడా అడిగాడని ఆమె కూడా నేను చేయలేనని స్పష్టం చేసిందని తెలుస్తోంది.
ఏమైనా బోల్డ్ డైరెక్టర్ అజయ్ భూపతి కి సీనియర్ హీరోయిన్స్ అంతా నో చెబుతూ దూరం జతుగుతున్నారు. ఎలాగూ హీరోలు డేట్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు డేట్లు ఇవ్వకపోవడం విచిత్రం.