Case on Youtuber Sarayu : బిగ్ బాస్ ఫేం సరయు మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలొచ్చాయి. హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా ఆమె నటించిన పాట ఉందని సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె తన ప్రచార సాంగ్ లో ‘కొంతమంది గణపతి బప్పా మోరియా అనే బ్యాండ్ ను తలకు ధరించి మద్యం సేవిస్తారు’.

ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని, ఈ చర్య తమను అవమానించినట్లు VHP నేత అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి బూతుల రాణికి మొత్తమ్మీద షాక్ తగిలింది అని చెప్పాలి. తన వీడియోల్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే ఈ బోల్డ్ నటి గతంలో అనేక రకాలుగా నోరు జారింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా సరయూ దారుణంగా కామెంట్స్ చేసింది.

అయితే, ఇప్పటి వరకు ఆమె ఇలాంటి కేసులను ఎదుర్కోలేదు. మధ్యలో కొంతమంది ఆమె పై ఫిర్యాదులు చేసినా.. అది స్టేషన్ వరకూ వెళ్ళలేదు. కానీ, ప్రస్తుతం సరయూ వ్యవహారం పోలీస్ స్టేషన్ లో రచ్చ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యూట్యూబర్ ‘సరయూ’ పై భారీగా విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఈ హాట్ ఓవర్ యాక్షన్ కు తగిన శాస్తి జరిగింది.
అసలు ఆమె ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు కంటే బూతులే ఎక్కువగా ఉంటాయి. ఆ స్థాయిలో సరయూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అయినా.. భావ ప్రకటనా స్వేచ్ఛను ఆమెలా మరొకరు ఎవరూ తప్పుగా ఉపయోగించలేదు. ఇక సరయూ భవిష్యత్తులో ఎలాంటి బూతులు మాట్లాడకుండా ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పోలిసులు ఈ కేసును ఏ స్థాయి వరకూ తీసుకువెళ్తారో చూడాలి.