https://oktelugu.com/

Mahesh Babu’s Fans : అల్లు అర్జున్‌ పై ఘోరమైన ట్రోల్స్.. కారణం అదే !

 Mahesh Babu’s Fans :‘పుష్ప‘ను  అభిమానులు,  సినీ ప్రముఖులే కాదు,  రాజకీయ నాయకులు కూడా  బాగా మెచ్చుకున్నారు.   కానీ వేరే హీరోల అభిమానులు మాత్రం  పుష్పను తక్కువ చేసి చూస్తున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన పి.ఆర్‌.టీమ్‌ ను విమ‌ర్శిస్తూ ఇత‌ర హీరోల ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్‌ గా పుష్ప 50 రోజుల‌ను పూర్తి చేసుకొని, రూ.365 కోట్ల‌ను వ‌సూలు చేసిందంటూ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దీనిపై మిగతా హీరోలా ఫ్యాన్స్ అదంతా అబద్దమని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 06:33 PM IST
    Follow us on

     Mahesh Babu’s Fans :పుష్ప‘ను  అభిమానులు,  సినీ ప్రముఖులే కాదు,  రాజకీయ నాయకులు కూడా  బాగా మెచ్చుకున్నారు.   కానీ వేరే హీరోల అభిమానులు మాత్రం  పుష్పను తక్కువ చేసి చూస్తున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన పి.ఆర్‌.టీమ్‌ ను విమ‌ర్శిస్తూ ఇత‌ర హీరోల ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్‌ గా పుష్ప 50 రోజుల‌ను పూర్తి చేసుకొని, రూ.365 కోట్ల‌ను వ‌సూలు చేసిందంటూ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

    Allu Arjun

    దీనిపై మిగతా హీరోలా ఫ్యాన్స్ అదంతా అబద్దమని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్ సిక్సర్ కొడితే.. వెస్టిండీస్ డ్రెస్సులో బన్నీ ఏడుస్తున్న‌ట్లు మీమ్స్ పెడుతున్నారు. మొత్తానికి  అల్లు అర్జున్‌ పై ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు.  మొత్తానికి గత వారం నుంచి పుష్ప పై ఎవరొకరు సీరియస్ అవుతూనే ఉన్నారు.  స్మగ్లర్ తగ్గేదేలే అంటాడా?  అంటూ  ‘పుష్ప’ సినిమా పై గరికపాటి కూడా  ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

    Mahesh babu and Allu Arjun

    ‘స్మగ్లర్‌ను హీరో చేశారు. చివర్లో 5 ని.లు మంచి చూపిస్తాం, పుష్ప-2 తీస్తాం అంటే నువ్వు తీసేలోపు సమాజం చెడిపోవాలా? స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే అంటాడా? ఇప్పుడది ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఈ డైలాగ్‌తో సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. దీనిపై హీరో, డైరెక్టర్‌‌ ను, అల్లు అర్జున్ ను సమాధానం చెప్పమనండి’ అని గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

    అయితే, ఇదే డైలాగ్ ను బాగా వాడుకుంటున్నారు కూడా.  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్‌ డైలాగ్‌ ను ఎంచుకుంది.   పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ స్టిల్‌ ను ఎడిట్‌ చేసి బన్నీకి మాస్క్‌ పెట్టింది.  మొత్తానికి పుష్పను తిట్టేవాళ్ళు తిడుతున్నారు. పొగిడే వాళ్లు పొగుడుతున్నారు.

     

    ఏది ఏమైనా పుష్ప సంచనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది.  మెయిన్ గా  అల్లు అర్జున్  పాన్ ఇండియా సినిమాలను తలకెత్తుకుని   ఆ ఇమేజ్ ను  మెయింటైన్ చేస్తూ  తనను తాను  పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రమోట్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు కూడా  చేస్తున్నాడు. దానికి కారణం పుష్పనే.