Mahesh Babu Chiranjeevi Reaction on Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు.

ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో “భీమ్లా నాయక్” సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘ఇద్దరు హీరోలు పవన్ – రానా వారి పాత్రల్లో హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ కూడా టాప్ లో ఉంది.

దర్శకుడు సాగర్ మిగతా టీమ్ అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు అని, ఈ సినిమాలో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మహేష్ చెప్పుకొచ్చాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలోని పవన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. “భీమ్లా నాయక్” సినిమాలో పవన్ అద్భుతంగా నటించాడు. తెర పై ఇలా ఎలా కనిపించాడో అని ఆలోచిస్తున్నా. నేను కాదు, పవన్ పాత్రను ఇలా ఎవరూ ఊహించలేదు. అంత పవర్ ఫుల్ గా ఉంది పాత్ర. పవన్ లుక్, పవన్ వేషధారణ చాలా స్ట్రాంగ్ గ ఉన్నాయి’ అని చిరు అన్నారు.
[…] Bheemla Nayak Movie Review: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తదితరులు. […]
[…] Bheemla Nayak US Premiere Collections: భీమ్లానాయక్ మేనియా మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ భీమ్లా నాయక్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25, 2022న థియేటర్లలో తుఫానులా విరుచుకుపడింది. ఈ సమ్మర్ వేడిని భీమ్లానాయక్ మొదలుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి. […]
[…] Bheemla Nayak Tickets Controversy: టాలీవుడ్‌లో ఏ హీరోకు లేనంత హార్డ్ కోర్ అభిమానులు కేవలం పవన్‌కు మాత్రమే ఉన్నారు. చాలామంది అతన్ని దేవుడు అంటూ కొలుస్తారంటే ఎంత పిచ్చి అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా చూసేందుకు చాలామంది ఎగబడుతున్నారు. ముఖ్యంగా టికెట్లకోసం పెద్ద గొడవే జరుగుతోంది. దాంతో ఏపీలని చాలాచోట్ల రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు. […]