Keerthy Suresh Good Luck Sakhi: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. కాగా తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల అయిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. మొదటి షో నుంచి ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా దారుణంగా వచ్చాయి. మరి ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే..

ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు !
గుంటూరు 0.05 కోట్లు
కృష్ణా 0.04 కోట్లు
నెల్లూరు 0.02 కోట్లు
నైజాం 0.07 కోట్లు
సీడెడ్ 0.04 కోట్లు
ఉత్తరాంధ్ర 0.05 కోట్లు
ఈస్ట్ 0.03 కోట్లు
వెస్ట్ 0.03 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.33 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.05 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.42 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: ఇటు ‘ప్రభాస్ – రాజమౌళి’కి పోటీ.. అటు ‘పవన్ – అజిత్’ కి పోటీ !
ఈ ‘గుడ్ లక్ సఖి’కి రూ.2.06 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.20 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. కొన్ని థియేటర్స్ లో అయితే, పోస్టర్స్ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు.
మొత్తానికి కీర్తి సురేష్ సోలోగా చేసిన సినిమాలు అన్నీ దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఆ క్రమంలోనే ఈ సినిమా మరో ప్లాప్ చిత్రంగా నిలిచింది. అసలు కీర్తి సురేష్ ను మెయిన్ లీడ్ గా పెట్టి ఎందుకు సినిమాలు చేసి లాస్ అవుతారయ్యా ? అంటూ.. నెటిజన్లు నిర్మాతలను, కీర్తి సురేష్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు.
Also Read: ‘ఓటీటీ’ : ఈ వీక్ సినిమాల పరిస్థితేంటి ?
[…] Also Read: ‘కీర్తి సురేష్’ను పెట్టుకుని ఎందుకు … […]
[…] Also Read: ‘కీర్తి సురేష్’ను పెట్టుకుని ఎందుకు … […]