Kajal Aggarwal Pregnant: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి అని ఊరంతా తెలుసు. అయినా ఈ ముదురు హీరోయిన్ మాత్రం తన కడుపును దాచడానికి ఇన్నాళ్లు నానాపాట్లు పడుతూ తెగ కష్టపడింది. ‘ఎందుకమ్మా చక్కగా అమ్మతనాన్ని ఆస్వాదించక, లేనిపోని మేకప్ లు వేసుకుని పొట్ట దాచుకోవడం’ అంటూ నెటిజన్లు కూడా తమదైన శైలిలో కాజల్ పాపకు ఇష్టం వచ్చినట్లు మెసేజ్ లు పెట్టారు.

అయినా, కాజల్ మాత్రం ఇంకా పర్ఫెక్ట్ గా ఫిజిక్ తోనే ఉన్నాను అంటూ ఇన్ డైరెక్ట్ గా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో ఈ హాట్ ఫోజులు ఇవ్వడం అవసరమా ? అంటూ కాజల్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా విచ్చలవిడిగా వచ్చేవి. అయినా కాజల్ మాత్రం తాను గర్భవతని అని మాత్రం నేటికీ ఒప్పుకోలేదు.
అయితే, కాజల్ వ్యవహారశైలిని అర్థం చేసుకున్న ఆమె భర్త గౌతమ్ కిచ్లూ మొత్తానికి ఈ వ్యవహారాన్ని బయట పెట్టేశాడు. గౌతమ్ ఒక హింట్ ఇస్తూ.. కాజల్ అగర్వాల్ ఫోటో ను కూడా పోస్ట్ చేశాడు. తాము ఈ 2022 ఏడాది కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని’ గౌతమ్ కిచ్లూ మెసేజ్ షేర్ చేశాడు. పైగా కాజల్ గర్భిణీ అనే అర్థం వచ్చే ఒక ప్రత్యేక ఎమోజీని కూడా గౌతమ్ కిచ్లూ పోస్ట్ చేశాడు.
Also Read: ఆచార్య ‘వచ్చిందే మందాకినీ’.. పక్కా మాస్ గురూ !
అలాగే, కాజల్ అగర్వాల్ బేబీ బంప్స్ పై చెయ్యేస్తూ ఒక ఫోటోకి ఫోజు ఇచ్చి, ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తమ్మీద తన భార్య కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని గౌతమ్ కిచ్లూ స్పష్టం చేశాడు. ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా గౌతమ్ ప్రకటించినప్పటి నుంచి కాజల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.
తమ కలల రాణి ఇక నుంచి పిల్లల తల్లిగా ఉహించుకోలేం అంటూ ఓ తుంటరి నెటిజన్ ఓ మెసేజ్ కూడా పెట్టాడు. అదేంటో గానీ, ఈ పెళ్లి అయినా హీరోయిన్లు అంతా గర్భవతలు అవ్వడానికి అసలు ఇష్టపడరు. అలాగే వారి అభిమానులు కూడా హీరోయిన్లను గర్భవతలుగా చూడలేరు.
Also Read: కాజల్ గురించి ఆసక్తికర న్యూస్ రివీల్ చేసిన గౌతమ్… ఎమోజితో అంతా చెప్పేశాడుగా ?